అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Advanced Robotic Surgery | వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సనత్‌నగర్ టిమ్స్ (TIMS) ఆస్పత్రిలో స్టేట్ లెవల్ మల్టీ స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్క్ షాప్‌ను ఆదివారం ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మెడికల్ రోబోటిక్ ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లను పరిశీలించారు.
మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్య సేవల బలోపేతానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఫార్మా హబ్‌గా రాష్ట్రం లో వైద్య ఆరోగ్య సేవల రంగంలో బ్రాండ్ గా విస్తరించేందుకు నూతనంగా TIMS, ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నామన్నారు. మెడికల్ కాలేజీలు, జీజీహెచ్ ఆసుపత్రులలో వచ్చే 6 నెలల్లో అడ్వాన్సుడ్ రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తేచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు.
Advanced Robotic Surgery | నిమ్స్‌లో..
ఇప్పటికే రోబోటిక్ సర్జరీ సేవలలో ముందడుగు వేశామని మంత్రి చెప్పారు. నిమ్స్ (NIMS) ఆస్పత్రి 1000 రోబోటిక్ సర్జరీలను నిర్వహించిన ఘనత సాధించిందన్నారు. రాష్ట్రంలో ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ , టీమ్స్ ఆస్పత్రులలో, నూతనంగా నిర్మిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, నీలోఫర్, వరంగల్ లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లతో పాటు రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న జీజీహెచ్‌లలో అడ్వాన్సుడ్ రోబోటిక్ సర్జరీ సేవలను విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మెడికల్ టూరిజం పాలసీలో భాగంగా టీమ్స్ ఆస్పత్రిలో 100 బెడ్లను ఇంటర్నేషనల్ పేషంట్ల కోసం అందుబాటులో ఉంచామని వెల్లడించారు.
దీనిని కూడా చదవండి : Russia Ukraine Peace | ఉక్రెయిన్ వార్‌కి భారత్, చైనా మద్దతు.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా సంచలన ప్రకటన