అక్షరటుడే, వెబ్డెస్క్: AP Municipal Elections | ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా విరామం ఏర్పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. తొలుత 19 ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని భావించినప్పటికీ, తాజాగా మొత్తం 100 స్థానాల్లో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
AP Municipal Elections | అభ్యర్థుల తుది జాబితాపై వాయిదా
అభ్యర్థుల తుది జాబితాను అక్టోబర్ 25 వరకు ప్రకటించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారన్న వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. నామినేషన్ల గడువును పొడిగించాలన్న అభ్యర్థనపై గురువారం నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు సమాచారం.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
AP Municipal Elections | కలెక్టర్లు, పోలీసుల నివేదికల ఆధారంగా నిర్ణయం
నామినేషన్ల ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు వచ్చిన ఫిర్యాదులు, శాంతిభద్రతల పరిస్థితిపై నివేదికలను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని, నామినేషన్ కేంద్రాల వద్ద అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా సుప్రీంకోర్టు రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది.