ఆంధ్రప్రదేశ్​Fishermen Compensation AP | ఏపీ మత్స్యకారులకు గుడ్‌న్యూస్.. మే 19 నుంచి ఖాతాల్లో రూ.20...

Fishermen Compensation AP | ఏపీ మత్స్యకారులకు గుడ్‌న్యూస్.. మే 19 నుంచి ఖాతాల్లో రూ.20 వేలు జమ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌!

సముద్రంలో వేట నిషేధ కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకార కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Fishermen Compensation AP | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని లక్షలాది మంది మత్స్యకార కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. సముద్రంలో చేపల వేట నిషేధం కొనసాగుతున్న సమయంలో కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం మరోసారి ‘మత్స్యకార భరోసా’ పథకాన్ని అమలు చేయనుంది.

ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ఆధ్వర్యంలో ఈ పథకం కింద భారీ స్థాయిలో నిధులు విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.20,000 చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు రూ.286 కోట్లను విడుదల చేయనుంది. మే 19వ తేదీ నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Fishermen Compensation AP | 61 రోజుల పాటు వేట నిషేధం

గత ప్రభుత్వ కాలంలో ఈ సాయం రూ.10,000 మాత్రమే ఉండగా, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం దానిని రెట్టింపు చేసి రూ.20,000కు పెంచింది. దీంతో మత్స్యకార కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా లభించనుంది. డబ్బులు జమ అయిన తర్వాత లబ్ధిదారులు ఈజీఎస్‌డబ్ల్యూఎస్ పోర్టల్ ద్వారా తమ పేమెంట్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. సముద్ర జీవసంపద పరిరక్షణ, చేపల సంతానోత్పత్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రతి ఏడాది వేసవి కాలంలో వేట నిషేధాన్ని అమలు చేస్తుంది. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మొత్తం 61 రోజుల పాటు సముద్రంలో యాంత్రిక, మోటారు బోట్లతో Motor Boats చేపల వేటను పూర్తిగా నిషేధించారు.

Fishermen Compensation AP | నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా

అయితే చిన్న పడవల ద్వారా తీర ప్రాంతానికి సమీపంలో వేటాడే వారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.30 లక్షల మత్స్యకార కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా, ఈసారి కూడా అర్హులైన వారందరికీ సాయం అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వేట నిషేధ సమయంలో నిబంధనలు అతిక్రమించి సముద్రంలోకి వెళ్లే వారిపై మత్స్యశాఖ కఠినంగా వ్యవహరించనుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా విధించడంతో పాటు, వేట వలలను స్వాధీనం చేసుకోనున్నారు.

అంతేకాకుండా సంబంధిత బోట్ల లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ను ఏడాది పాటు రద్దు చేయనున్నారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారికి మత్స్యకార భరోసా సాయం కూడా నిలిపివేయబడుతుంది. ఇక మత్స్యకారులకు మరింత ఊరటనిచ్చేలా బోట్లకు అందించే డీజిల్ సబ్సిడీని లీటరుకు రూ.9కు పెంచారు. అలాగే వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి..: Eluru Pastor Arrest | మైన‌ర్​పై చ‌ర్చి పాస్ట‌ర్ అత్యాచారం.. గర్బం దాల్చిన బాలిక!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Suvendu Adhikari Oath | పశ్చిమ బెంగాల్ బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Suvendu Adhikari Oath | పశ్చిమ బెంగాల్...

Instagram Followers Drop | ఇన్​స్టాగ్రామ్​లో సంచలనం.. ఒకేరోజు కోట్లలో ఫాలోవర్లు మాయం..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Instagram Followers Drop | ప్రముఖ సోషల్​మీడియా (Social...

Bird Flu in Maharashtra | మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. వేల కోళ్లను పూడ్చేసిన అధికారులు..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bird Flu in Maharashtra | మహారాష్ట్రలో బర్డ్​ఫ్లూ...

Vijay Thalapathy Prediction | విజయ్ దళపతిపై వేణుస్వామి సంచలన జోస్యం.. త్రిష లేకపోతే రిజల్ట్ వేరేలా..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Vijay Thalapathy Prediction | ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్​ వేణుస్వామి...