Hyderabad New Restaurants | హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైటెక్ సిటీ ‘ది లాఫ్ట్’లో నాలుగు కొత్త రెస్టారెంట్లు ప్రారంభం..

హైదరాబాద్‌లోని ఆహార ప్రియులకు సరికొత్త రుచులను పరిచయం చేస్తూ, హైటెక్ సిటీలోని ‘ది లాఫ్ట్’ లో ప్రముఖ ఈహెచ్‌వీ ఇంటర్నేషనల్ రెస్టారెంట్లను ప్రారంభించింది.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad New Restaurants | హైదరాబాద్‌లోని ఆహార ప్రియులకు సరికొత్త రుచులను పరిచయం చేస్తూ, హైటెక్ సిటీలోని ఆర్‌ఎంజెడ్ నెక్సిటీ (RMZ Nexity) వద్ద ఉన్న ‘ది లాఫ్ట్’ (The Loft) లో ప్రముఖ ఈహెచ్‌వీ ఇంటర్నేషనల్ (EHV International) సంస్థ తన నాలుగు ప్రత్యేక రెస్టారెంట్లను ప్రారంభించింది. ఫైర్‌బ్యాక్, బార్‌బ్యాక్, హోసా, ఆల్ అమెరికన్ డైనర్ పేర్లతో ఏర్పాటైన ఈ రెస్టారెంట్లతో ఈహెచ్‌వీ గ్రూప్ తొలిసారిగా హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది.

Hyderabad New Restaurants | విభిన్న రుచుల కలయిక..

ఈ నాలుగు రెస్టారెంట్లు హైదరాబాద్ (Hyderabad) నగరానికి పూర్తిగా కొత్త అనుభూతిని అందించనున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత థాయ్ వంటకాల నిపుణుడు షెఫ్ డేవిడ్ థాంప్సన్ ఆధ్వర్యంలో ‘ఫైర్‌బ్యాక్’ (Fireback) అసలైన థాయ్ వంటకాలను వడ్డిస్తుండగా, బ్యాంకాక్ చైనాటౌన్ తరహా రాత్రిపూట వైబ్‌తో ‘బార్‌బ్యాక్’ (Barback) ఆగ్నేయాసియా కాక్‌టెయిల్స్, ప్రత్యేక వంటకాలను అందిస్తోంది. ఇక ‘హోసా’ (Hosa) దక్షిణ భారత తీర ప్రాంతాల సంప్రదాయ రుచులకు ఆధునిక హంగులు అద్ది పరిచయం చేస్తోంది. 2001 నుంచి ఢిల్లీలో విశేష ఆదరణ పొందిన ‘ఆల్ అమెరికన్ డైనర్’ (All American Diner) దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ఇక్కడ ప్రారంభమైంది.

Hyderabad New Restaurants | కళాత్మక వాతావరణం..

మెటెక్స్ డిజైన్ గ్రూప్, డీపీఏ సింగపూర్ సంస్థల భాగస్వామ్యంతో రూపొందించిన ‘ది లాఫ్ట్’ చుట్టూ ఉన్న గ్లాస్ టవర్ల మధ్య ఎర్ర ఇటుకల నిర్మాణం, ఎత్తైన ఆర్చ్ కిటికీలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. లోపల వెచ్చని లైటింగ్, కలప, రాయి, లెదర్ అలంకరణలతో ఇదొక ప్రైవేట్ నివాసంలా కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పటికే వన్8 కమ్యూన్, అకినా రూఫ్‌టాప్ బార్, ట్రూ బ్లాక్ కాఫీ, ఆఫ్ ది షెల్ఫ్ బుక్‌స్టోర్ వంటివి ఉండటంతో.. ఉదయం కాఫీ నుంచి రాత్రి విందు వరకు పూర్తిస్థాయి వినోద కేంద్రంగా మారింది. మైఖేల్ క్రెయిగ్-మార్టిన్, భూరి బాయి, శిల్పా గుప్తా వంటి ప్రముఖ కళాకారుల కళాఖండాలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.

Hyderabad New Restaurants | ప్రతి సారి విలువైన అనుభూతి అందించడమే లక్ష్యం..

ఈ సందర్భంగా ఆర్‌ఎంజెడ్ రిటైల్ వైస్ ప్రెసిడెంట్ గౌరంగ్ సిన్హా మాట్లాడుతూ.. ‘ది లాఫ్ట్’ను నగరవాసుల కోసం ఒక ఇంటిలా భావిస్తామని, నాలుగు విభిన్న రెస్టారెంట్లను ఒకేసారి తీసుకురావడం ద్వారా ప్రజలు మళ్లీ మళ్లీ వచ్చేలా ప్రత్యేక అనుభూతిని అందిస్తున్నామని తెలిపారు. ఈహెచ్‌వీ ఇంటర్నేషనల్ సీఈఓ నితిన్ మాథుర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ‘ది లాఫ్ట్’లో తమ నాలుగు రెస్టారెంట్లను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రారంభం నుంచే కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: DBS Wealth Branch Hyd | హైదరాబాద్ బంజారాహిల్స్‌లో డీబీఎస్ ట్రెజర్స్ వెల్త్ బ్రాంచ్ ప్రారంభం..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *