Inter Supplementary Results | నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన వేలాది మంది విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. గత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు కీలక అవకాశంగా నిలిచాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter Supplementary Results | తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్ష-2026 ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

Inter Supplementary Results | ఉదయం 11.30 గంటలకు..

జనరల్, ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన సప్లిమెంటరీ ఫలితాలను గురువారం ఉదయం 11.30 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు బోర్డు తెలిపింది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చని సూచించింది.

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన వేలాది మంది విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. గత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు కీలక అవకాశంగా నిలిచాయి.

మార్కుల మెమో డౌన్‌లోడ్

ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అవసరమైన వివరాలతో వెబ్‌సైట్‌లో లాగిన్ అవడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఫలితాల విడుదలతో విద్యార్థుల భవిష్యత్ విద్యా ప్రణాళికలు, ఉన్నత విద్య ప్రవేశాల ప్రక్రియకు మార్గం సుగమం కానుంది.

Hyderabad Rain Traffic | అంతర్జాతీయ నగరమంటూ ప్రచారం.. చిన్న వర్షానికే ట్రాఫిక్ నరకం!.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు దెబ్బతీస్తున్న మౌలిక వసతుల వైఫల్యాలు

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *