అక్షరటుడే వెబ్‌డెస్క్: Jawa Yezdi Nomads Community | ఈ పండుగ సీజన్‌లో జావా, యెజ్డీ, బీఎస్ఏ నోమాడ్స్ కమ్యూనిటీ దేశవ్యాప్తంగా 3,00,000 మంది సభ్యుల సంఖ్యను దాటి కీలక మైలురాయిని చేరుకుంది. మోటార్‌సైక్లింగ్ పట్ల ఆసక్తి ఉన్న రైడర్లను ఒకచోట చేరుస్తున్న ఈ కమ్యూనిటీ కొత్త గమ్యస్థానాల అన్వేషణ, అనుభవాల మార్పిడి, బంధాల బలోపేతానికి వేదికగా నిలుస్తోంది.
Jawa Yezdi Nomads Community | 2018 పునరాగమన జోష్..
తరతరాలుగా బైక్ ప్రియులు నిలబెట్టిన వారసత్వంపై నోమాడ్స్ కమ్యూనిటీ రూపొందింది. భారతదేశంలో ( India ) కొత్త జావా, యెజ్డీ బైక్‌ల తయారీ నిలిచిపోయిన కాలంలోనూ స్వతంత్ర యజమానుల బృందాలు, కలెక్టర్లు, ఔత్సాహికులు రైడ్‌లు, కథల ద్వారా బ్రాండ్ స్ఫూర్తిని సజీవంగా ఉంచారు. 2018లో జావా తిరిగి భారత్‌లోకి వచ్చినప్పుడు ఒక్క రోజులోనే 1,00,000కు పైగా బుకింగ్‌లు నమోదు కావడం ఈ బ్రాండ్ పట్ల ఉన్న ఆదరణను చూపింది.
Jawa Yezdi Nomads Community | ప్రత్యేక రైడ్‌లు..
వివిధ ప్రాంతాల రైడర్లను కలుపుతూ జాతీయ, ప్రాంతీయ రైడ్‌లు, డీలర్‌షిప్ అవుటింగ్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు, మీట్‌అప్‌లను నోమాడ్స్ నిర్వహిస్తోంది. ఇందులో ఐబెక్స్ ట్రయల్, పంజాబ్ ద టోర్, టకట్ సంగ్ ట్రయల్, ధృవ కార్గిల్ రైడ్, ట్రయల్ అటాక్, రైడ్ టు రూట్స్ వంటి ప్రత్యేక ప్రయాణాలతో పాటు రైడ్ టు గివ్ బ్యాక్ వంటి సామాజిక కార్యక్రమాలు ఉన్నాయి.
క్లాసిక్ లెజెండ్స్ సహ-స్థాపకుడి స్పందన..
కొత్త మోటార్‌సైకిళ్ల తయారీ లేని ఏళ్లలోనూ యజమానులు, స్వతంత్ర కమ్యూనిటీలు తమ బైక్‌లు, రైడ్‌లు, అనుభవాలతో బంధాన్ని నిలబెట్టాయని క్లాసిక్ లెజెండ్స్ సహ-స్థాపకులు అనుపమ్ థరేజా తెలిపారు. 2018లో జావా పునరాగమన సమయంలో వచ్చిన స్పందన తరతరాల్లోని ఈ అనుబంధాన్ని మరోసారి రుజువు చేసిందని పేర్కొన్నారు. నోమాడ్స్ కమ్యూనిటీ 3,00,000 సభ్యులను దాటడం జావా, యెజ్డీ, బీఎస్ఏ రైడర్ల అభిరుచి, ఆత్మీయతకు నిదర్శనమని, కలిసి ప్రయాణించేందుకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని ఆయన చెప్పారు.
Jawa Yezdi Nomads Community | రైడర్లతో నిరంతర అనుసంధానం..
రైడ్‌లు, సామాజిక కార్యక్రమాలు, అనుభవాల పంచుకోవడం ద్వారా రైడర్లతో బలమైన అనుబంధాన్ని పెంచుకోవడంపై బ్రాండ్లు దృష్టి పెట్టాయి. దేశవ్యాప్తంగా 3 లక్షల మంది సభ్యులతో నోమాడ్స్ కమ్యూనిటీ కొత్త రైడర్లను కలుపుతూ, జావా, యెజ్డీ, బీఎస్ఏ బైక్ యాజమాన్య అనుభవాన్ని మరింత చేరువ చేస్తోంది.
ఇది కూడా చదవండి: Sabarimala Video Ban | అయ్యప్ప భక్తులకు అలర్ట్.. శబరిమలలో ఈ తప్పు చేస్తే అరెస్టే..