Dhoolpet Ganja Raids | గంజాయి దందాపై ఉక్కుపాదం

ధూల్​పేటలో ఎక్సైజ్​ అధికారులు దాడులు నిర్వహించి గంజాయి కేసులో నిందితులను అరెస్ట్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dhoolpet Ganja Raids | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో గంజాయి దందా జోరుగా సాగుతోంది. దీంతో పోలీసులు, ఈగల్​ ఫోర్స్​, ఎక్సైజ్​ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపడుతూ.. గంజాయి దందాపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా నగరంలోని ధూల్​పేటలో ఎక్సైజ్​ అధికారులు భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. గంజాయి కేసులకు సంబంధించి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

Dhoolpet Ganja Raids | ఏకకాలంలో దాడులు

ఎక్సైజ్ యూనిట్లకు చెందిన 30 మంది సభ్యుల బృందం ధూల్​పేటలోని మాంగు బస్తీ, బలరాం గల్లీ, గంగాబౌలి, మంగళ్ హాట్, లోయర్ ధూల్‌పేట మరియు జుమ్మేరాత్ బజార్ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న.. ఏడుగురిని అరెస్ట్​ చేసింది. వారిలో జయాబాయి, శివ వాణి సింగ్, స్నేహ సింగ్, సుమన్ భాయ్, నయన, దేవేందర్ సింగ్, దుర్గేష్ ఉన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అవినాష్ మొహంతి, గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస రెడ్డి ఆదేశాల మేరకు ఈ సోదాలు చేపట్టారు. గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు చేపడుతామని వారు హెచ్చరించారు.

దీనిని కూడా చదవండి : Mystery Poster | కామారెడ్డిలో మిస్టరీగా మారిన పోస్టర్.. కొత్త పార్టీపై ఉహాగానాలు?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *