అక్షరటుడే వెబ్డెస్క్: Pfizer Cancer Screening | ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ( Tirupati )క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్, ఆరోగ్య కార్యకర్తల శిక్షణ కార్యక్రమాల ద్వారా 2,38,000 మంది లబ్ధిదారులకు సేవలు అందించినట్లు ఫైజర్, టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ (TCCF) వెల్లడించాయి. నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల ముందస్తు గుర్తింపు కోసం మొత్తం 1,57,000 మందికి పరీక్షలు నిర్వహించగా, 701 మందిలో క్యాన్సర్ ఉన్నట్లు అనుమానించి, 84 మందికి నిర్ధారణ చేశారు. అలాగే 9,700 మంది ఫ్రంట్లైన్ ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు.
Pfizer Cancer Screening | 14.1 లక్షల మందికి సేవలు..
టాటా ట్రస్ట్స్ ఆధ్వర్యంలోని TCCFతో కలిసి ఫైజర్ కమ్యూనిటీ స్థాయిలో క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపుపై దృష్టి సారించింది. ఇప్పటివరకు జార్ఖండ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో 14.1 లక్షల మంది లబ్ధిదారులకు చేరువైంది. ఈ భాగస్వామ్యంలో 11,15,558 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, 720 మందిలో క్యాన్సర్ నిర్ధారించగా, 31,000 మంది ఆరోగ్య నిపుణులకు శిక్షణ కల్పించారు.
Pfizer Cancer Screening | భాగస్వామ్య సమావేశం..
నవంబర్ 25న తిరుపతిలో ‘క్యాన్సర్ సంరక్షణలో వివిధ రంగాల భాగస్వామ్యంతో నూతన ఆవిష్కరణలు, మార్పులు’ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఇందులో తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు TCCF, ఫైజర్, టాటా ట్రస్ట్స్, ఏసీసీఎఫ్, ఎస్వీఐసీఏఆర్, పబ్లిక్ హెల్త్ తిరుపతి, ఐఐఎస్ఈఆర్, ఐఐటీ తిరుపతి ప్రతినిధులు పాల్గొన్నారు. క్యాన్సర్ నివారణ, పరీక్షల విస్తరణ, సకాలంలో చికిత్స అందించే యంత్రాంగాలపై చర్చించారు.
Pfizer Cancer Screening | పెరుగుతున్న క్యాన్సర్ కేసులు..
ఐసీఎంఆర్-నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (ICMR-NCRP) అంచనాల ప్రకారం, 2024లో దేశవ్యాప్తంగా సుమారు 15.3 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2022లో 70,424గా ఉన్న అంచనా కేసులు 2024 నాటికి 76,708కి పెరిగాయి. వ్యాధిని ముందుగానే గుర్తించి, అనుమానిత కేసులను సకాలంలో వైద్య సేవలకు అనుసంధానం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ప్రతినిధులు పేర్కొన్నారు.
Pfizer Cancer Screening | సంస్థల ప్రతినిధుల స్పందన..
ప్రజలకు చేరువవుతూ, తగిన వైద్య సేవలు అందించే ఉమ్మడి కార్యక్రమాలను స్వాగతిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. సామాజిక ఆరోగ్యానికి తిరుపతిలో మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. ప్రజారోగ్య భాగస్వాములతో కలిసి క్యాన్సర్ నివారణ అంతరాలను తగ్గిస్తున్నామని ఫైజర్ ఇండియా కంట్రీ ప్రెసిడెంట్ మీనాక్షి నేవాటియా తెలిపారు. అవగాహన, ముందస్తు నిర్ధారణ, సేవల అందుబాటు ద్వారా క్యాన్సర్ భారాన్ని తగ్గించడమే లక్ష్యమని TCCF సీఈఓ డాక్టర్ శైలేష్ శ్రీఖండే చెప్పారు.
ఇది కూడా చదవండి: Sabarimala Video Ban | అయ్యప్ప భక్తులకు అలర్ట్.. శబరిమలలో ఈ తప్పు చేస్తే అరెస్టే..