Ganja Drug Destruction | భారీఎత్తున గంజాయి, మత్తు పదార్థాలు ధ్వంసం

కామారెడ్డి జిల్లాలో పట్టుబడ్డ మత్తు పదార్థాలను జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ధ్వంసం చేశామని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Ganja Drug Destruction | జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో (Kamareddy) పట్టుబడ్డ మత్తు పదార్థాలను జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రీయపద్ధతిలో ధ్వంసం చేశామని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదైన 9 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 402.184 కిలోల గంజాయి, 83 గంజాయి మొక్కలు, 286 గ్రాముల అల్ప్రాజోలం, 40 గ్రాముల క్లోరల్ హైడ్రేట్‌ను ధ్వంసం చేశామన్నారు.

Ganja Drug Destruction | పలు స్టేషన్లలో..

బిచ్కుంద, జుక్కల్, పెద్ద కొడపగల్, ఎల్లారెడ్డి, రామారెడ్డి, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఈ మత్తు పదార్థాలను కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలోని సురక్షిత గదిలో భద్రపరిచారన్నారు. ఫోరెన్సిక్ పరీక్షల కోసం అవసరమైన నమూనాలను పంపిన అనంతరం మిగిలిన మత్తు పదార్థాలను నిబంధనల ప్రకారం నిర్వీర్యం చేయాలని కమిటీ నిర్ణయించిందని పేర్కొన్నారు. జక్రాన్‌పల్లి మండలం పడకల్ గ్రామంలోని శ్రీ మెడికేర్ సర్వీసెస్‌లో ప్రభుత్వ నిబంధనలు, కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం మత్తు పదార్థాలను ధ్వంసం చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ మధుసూధన్, డీసీఆర్బీ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ‘Ranu Bombay Ki Ranu’ Reaches International Level! | Anchor Indu Shares Her Views

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *