Nizamabad HIV Control | హెచ్ఐవీ నియంత్రణలో నిజామాబాద్​కు ప్రత్యేక గుర్తింపు

హెచ్ఐవీ ఎయిడ్స్ నిర్ధారణ, నివారణ, నియంత్రణ కార్యక్రమంలో నిజామాబాద్​ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad HIV Control | హెచ్ఐవీ ఎయిడ్స్ నిర్ధారణ, నివారణ, నియంత్రణ కార్యక్రమంలో నిజామాబాద్ (Nizamabad)​ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మదిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమం కింద జిల్లా ఈ ఘనతను సాధించింది.

Nizamabad HIV Control | అదనపు కలెక్టర్​కు ఘన సన్మానం

అదనపు కలెక్టర్ భుజంగరావును టీజీ సెక్స్ డిప్యూటీ డైరెక్టర్ నరేష్ రెడ్డి, అడిషనల్ డైరెక్టర్ ఫనిరేఖ, డీఎంహెచ్​వో రాజశ్రీ ఘనంగా సత్కరించి అభినందించారు. జిల్లా యంత్రాంగం అందించిన పూర్తి సహకారంతోపాటు వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ అధికారులు ఐసీటీసీ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సమన్వయ కృషి వల్ల ఈ గుర్తింపు సాధ్యమైందని డిప్యూటీ డైరెక్టర్ నరేష్ రెడ్డి ప్రశంసించారు. రాబోయే రోజుల్లో హెచ్ఐవీ పరీక్షల విస్తరణ, పాజిటివ్ వ్యక్తులను ఏఆర్టీ చికిత్సలకు అనుసంధానించడం, వైరల్ లోడ్ పరీక్షలు, గర్భిణులకు స్క్రీనింగ్, ఇండెక్స్ టెస్టింగ్, ఇంటి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.

Nizamabad HIV Control | వందశాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు..

అనంతరం అదనపు కలెక్టర్ భుజంగరావు మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవీ నిర్ధారణ, చికిత్స, నివారణ, నియంత్రణ చర్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. నియంత్రణ చర్యలు, అవగాహన కార్యక్రమాలు మరింత బలోపేతం చేసి వందశాతం చేరుకోవడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. తదుపరి లక్ష్యమైన సురక్షిత ప్లస్ స్థాయిని సాధించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి రాజశ్రీ, అడిషనల్ డైరెక్టర్ ఫని రేఖ, ప్రోగ్రాం అధికారి డాక్టర్ భార్గవి, ఏఆర్టీ వైద్యాధికారి ప్రవీణ్, డీపీఎంవో సుధాకర్, డీహెచ్ఈ ఘన్​పూర్​ వెంకటేశ్వర్లు, సీపీవో మోఈజ్, సీఎస్​వో నవీన్​, సహాయోగి సమతా, వైఆర్​జీ సుధాకర్, స్నేహ సొసైటీ శివ  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ‘Ranu Bombay Ki Ranu’ Reaches International Level! | Anchor Indu Shares Her Views

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *