అక్షరటుడే, వెబ్‌డెస్క్: June 17 Market Analysis | గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా స్పందిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు నెగెటివ్‌గా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
అమెరికా -ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందంపై పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉన్నారు. వాల్ స్ట్రీట్ గత సెషన్‌లో నష్టాలతో, యూరోప్ మార్కెట్లు లాభాలతో ముగియగా.. ఆసియా మార్కెట్లు బుధవారం మిక్స్‌డ్‌గా ట్రేడవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే స్వల్ప డిస్కౌంట్ తో ట్రేడవుతోంది. ఇది భారత స్టాక్ మార్కెట్ సూచీలు నెగెటివ్‌గా ప్రారంభమవుతాయని సూచిస్తోంది.
June 17 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
టెక్నాలజీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో అమెరికా స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాలతో ముగిసింది. గత సెషన్‌లో నాస్‌డాక్ 1.15 శాతం, ఎస్ అండ్ పీ 0.57 శాతం నష్టపోగా.. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.11 శాతం లాభంతో ఉంది.
June 17 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.07 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.75 శాతం పెరగ్గా.. యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.61 శాతం లాభపడింది.
June 17 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 1.19 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.78 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.20 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.04 శాతం లాభాలతో ఉండగా.. తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.57 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.23 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.10 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 749 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు 21వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 6 లక్షల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.99 నుంచి 1.08 కి పెరిగింది.
- విక్స్ 6.9 శాతం తగ్గి 13.36 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసలు బలపడి 94.56 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.51 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.44 వద్ద ఉన్నాయి.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 79.07 డాలర్ల వద్ద ఉంది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నందున పెట్టుబడిదారుల దృష్టి ఇప్పుడు కొత్తగా నియమితులైన ఫెడ్ చైర్మన్ కెవిన్ వార్ష్ నేతృత్వంలో జరుగుతున్న తొలి యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశంపై ఉంది. ప్రధానంగా వడ్డీ రేటు స్థిరంగా ఉంటుందని అంచనా వేస్తున్నప్పటికీ, ద్రవ్య విధాన గమనంపై ఫార్వర్డ్ గైడెన్స్ ఎలా ఇస్తారు. ఏ కామెంట్స్ చేస్తారు అన్నదాని కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు.