Kavya Maran Anirudh Wedding | ఉద్యోగులకు కావ్య మారన్, అనిరుధ్ గ్రాండ్ ట్రీట్.. అదిరిపోయే సర్‌ప్రైజ్ గిఫ్ట్‌..

గ్రీస్‌లో డ్రీమ్ వెడ్డింగ్‌తో ఒక్కటైన నూతన దంపతులు కావ్య మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తమ పెళ్లి సెలబ్రేషన్స్‌ను సన్ గ్రూప్ ఎంప్లాయీస్‌తోనూ గ్రాండ్‌గా షేర్ చేసుకున్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kavya Maran Anirudh Wedding | గ్రీస్‌లో డ్రీమ్ వెడ్డింగ్‌తో ఒక్కటైన నూతన దంపతులు కావ్య మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తమ పెళ్లి సెలబ్రేషన్స్‌ను సన్ గ్రూప్ ఎంప్లాయీస్‌తోనూ గ్రాండ్‌గా షేర్ చేసుకున్నారు. చెన్నైలోని  ( Chennai )సన్ గ్రూప్ హెడ్ ఆఫీస్‌లో ఉద్యోగుల కోసం స్పెషల్ లంచ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. పింక్ కలర్ అవుట్‌ఫిట్స్‌లో మెరిసిన ఈ కపుల్.. స్వయంగా ఉద్యోగుల దగ్గరకు వెళ్లి పలకరించారు. వారితో సరదాగా ముచ్చటిస్తూ ఫొటోలు, సెల్ఫీలు దిగడంతో ఆఫీస్ ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది.

Kavya Maran Anirudh Wedding | సర్‌ప్రైజ్ గిఫ్ట్ బాక్సులు..

ఎంప్లాయీస్ కోసం ఏర్పాటు చేసిన ఈ మెగా లంచ్ మెనూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఘుమఘుమలాడే బిర్యానీతో పాటు రకరకాల నాన్-వెజ్ ఐటమ్స్, డెజర్ట్‌లలో ఐస్‌క్రీమ్, గులాబ్ జామూన్ వంటి స్వీట్లతో రాయల్ ట్రీట్ ఇచ్చారు. కేవలం విందు మాత్రమే కాకుండా, పెళ్లి వేడుకల సందర్భంగా కావ్య మారన్ ఫ్యామిలీ ఉద్యోగులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. లంచ్ ఇన్విటేషన్ కార్డులతో పాటు చాక్లెట్లు, గోల్డ్ రింగ్స్ ఉన్న గిఫ్ట్ బాక్సులను అందజేసింది. బాక్సులు ఓపెన్ చేసిన ఉద్యోగులు లోపల బంగారు ఉంగరాలు చూసి షాక్ అవ్వడమే కాకుండా, ఆ వీడియోలను షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారాయి.

Kavya Maran Anirudh Wedding | వరుస వేడుకలతో..

సన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓగా కావ్య మారన్ బిజీగా ఉంటూనే తన పర్సనల్ లైఫ్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇటీవలే గ్రీస్‌లో వివాహం చేసుకున్న కావ్య, అనిరుధ్ జంట.. చెన్నైలో రెండు గ్రాండ్ రిసెప్షన్లు కూడా నిర్వహించింది. ఇప్పుడు తమ సంస్థ ఉద్యోగులకు కూడా ప్రత్యేక విందు, బహుమతులు ఇచ్చి మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచారు.

ఇది కూడా చదవండి: Police Sports | నేటి నుంచి రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలు… అగ్నిమాపక శాఖ పటిష్ట బందోబస్తు!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *