Police Sports | నేటి నుంచి రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలు… అగ్నిమాపక శాఖ పటిష్ట బందోబస్తు!

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 5వ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలు (2026–27) గురువారం (నవంబర్ 26) నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Police Sports | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 5వ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలు (2026–27) గురువారం (నవంబర్ 26) నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ క్రీడా పోటీల సందర్భంగా ఎలాంటి అగ్నిప్రమాదాలు, అత్యవసర పరిస్థితులు తలెత్తకుండా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి మేరకు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.

Police Sports | రఘునాథ చెరవు వద్ద..

క్రీడలు జరిగే నగరంలోని రఘునాథ చెరువు వద్ద నవంబర్ 25 నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక అగ్నిమాపక బృందాన్ని స్టాండ్‌బై డ్యూటీలో నియమించారు. ఇందులో నిజామాబాద్ (Nizamabad), ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్-రూరల్ అగ్నిమాపక కేంద్రాలకు చెందిన లీడింగ్ ఫైర్ ఫైటర్లు టి. ఏసురత్నం, బి. కిరణ్ కుమార్‌లతో పాటు మరో ఆరుగురు సిబ్బంది జి. ప్రశాంత్, జి. సూరజ్, బి. హరి, కె. సురేందర్, కె. హన్మన్ చారి, కె. ప్రశాంత్ గౌడ్ విధులు నిర్వహిస్తున్నారు.

​Police Sports | జానకంపేట సీటీసీలో ఫైర్ ఇంజిన్ ఏర్పాటు..

Police Sports

ఈ సందర్భంగా డీఎఫ్​వో పరమేశ్వర్​, ఎస్​ఎఫ్​వో శంకర్​ ఆధ్వర్యంలో పోలీస్​స్పోర్ట్స్​ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రీడా పోటీల్లో భాగంగా జానకంపేటలోని సిటీ ట్రైనింగ్ సెంటర్ (సీటీసీ)లో జరిగే ముఖ్య కార్యక్రమాలకు భారీ సంఖ్యలో పోలీసు అధికారులు, సిబ్బంది హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో 27వ తేదీ రాత్రి 7 గంటల నుంచి ‘బడాఖానా’ కార్యక్రమం ముగిసే వరకు, అలాగే 28వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ముగింపు వేడుకలు పూర్తయ్యే వరకు ఒక ఫైర్ ఇంజిన్‌తో పాటు తగినంత సిబ్బందిని అందుబాటులో ఉంచాలని పోలీస్ కమిషనర్ కార్యాలయం జిల్లా అగ్నిమాపక అధికారిని కోరింది.

ఇది కూడా చదవండి..: SRSP Submerged Villages | నీటి అడుగున దాగిన 35 గ్రామాల చరిత్ర.. ఎస్సారెస్పీలో ముగినిన జ్ఞాపకాలెన్నో..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *