అక్షరటుడే, వెబ్డెస్క్: Muslim Reservations | ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని మోదీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తన వెబ్సైట్లో ఆయన సంపాదకీయం రాశారు. ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించి, ముస్లింలకు కోటాలు ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ చర్యను ఆయన అత్యంత దిగ్భ్రాంతికరంగా అభివర్ణించారు.
రాజ్యాంగ రూపకర్తలు తిరస్కరించిన అజెండాను ప్రతిపక్షాలు ముందుకు నెడుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రతిపక్షంలోని అతిపెద్ద పార్టీ ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించి, ముస్లిం రిజర్వేషన్లను తీసుకురావాలని కోరుకోవడం అత్యంత దిగ్భ్రాంతికరం అని విమర్శించారు. డాక్టర్ అంబేద్కర్ దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ను ఉద్దేశించి ఆయన విమర్శలు చేశారు. అది ప్రతిపక్షం కంటే అవరోధ పక్షంగా మారిందన్నారు.
Muslim Reservations | మహిళా రిజర్వేషన్ బిల్లుపై..
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో వీగిపోయిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని స్పందిస్తూ.. ప్రతిపక్ష పార్టీ దాని ఆమోదాన్ని అడ్డుకుని “రాజ్యాంగ విలువలను ధిక్కరించిందని” ఆరోపించారు. భారతదేశ నారీశక్తికి న్యాయం జరిగేలా చూడకుండా తమను ఏ శక్తీ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ఐదు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ రాజ్యాంగాన్ని బలహీన పరించిదన్నారు. 1951 నాటి మొదటి సవరణకు ఈ ఏడాది 75 ఏళ్లు, న్యాయ సమీక్షను పరిమితం చేసిన ఎమర్జెన్సీ సమయంలోని 42వ సవరణకు 50 ఏళ్లు పూర్తవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: BSF Constable Venu | పశువుల అక్రమ రవాణాను అడ్డుకునే యత్నంలో.. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతి