MLC Election Results | ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం.. నాగ్​పూర్​లో గెలిచిన కాంగ్రెస్​

మహారాష్ట్రలోని నాగ్​పూర్​ ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్​ గెలుచుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: MLC Election Results | నాలుగు రాష్ట్రాల్లోని 28 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్​ ఒక సీటు గెలుపొందింది. మహారాష్ట్ర (Maharashtra)లోని నాగ్​పూర్​ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఒక్క సీటు కూడా గెలవలేదని ప్రధాని మోదీ బుధవారం ట్వీట్​ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్​ సైతం అదేవిధంగా పోస్ట్​ చేశారు. అయితే తుది ఫలితాలు వెలువడకముందే వారు పోస్ట్ చేశారు. అనంతరం ఫలితాల్లో కాంగ్రెస్​ ఒక సీటు గెలుపొంది పరువు కాపాడుకుంది. దీంతో ఫడ్నవీస్​ తన ట్వీట్​ డిలీట్ చేశారు.

MLC Election Results | యూపీలో బీజేపీ

ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్​లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. యూపీలో బీజేపీ, దాని మిత్రపక్షాలు మెజారిటీ స్థానాలు గెలుచుకున్నాయి. మహారాష్ట్రలో ఆర్‌ఎస్‌ఎస్​కు కంచుకోటగా పరిగణించబడే నాగ్‌పూర్ డివిజన్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వరుసగా రెండోసారి విజయం సాధించడం గమనార్హం. సుదీర్ఘంగా సాగిన ఓట్ల లెక్కింపు అనంతరం ఎంవీఏ మద్దతు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి అభిజిత్ గోవిందరావు వంజారి 3,271 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉత్తరప్రదేశ్‌లో 11 స్థానాలకు బీజేపీ ఆరు చోట్ల విజయం సాధించింది. సమాజ్‌వాదీ పార్టీ మూడింటిని దక్కించుకుంది. అధికారంలో ఉన్న కర్ణాటకలో సైతం కాంగ్రెస్​ ఒక్క సీటు గెలుచుకోలేకపోవడం గమనార్హం. నాలుగు సీట్లలో ఎన్​డీఏ కూటమి విజయం సాధించింది.

ఇది కూడా చదవండి..: Amazon Layoffs 2026 | ఉద్యోగులకు అమెజాన్​ షాక్​.. 250 మందిని తొలగిస్తూ మెయిల్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *