Murasu Cyclone | తుపాన్​ ఎఫెక్ట్.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన

మురాస్​ తుపాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Murasu Cyclone | మరో తుపాన్ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మురాసు తీవ్ర తుపాన్​గా మారింది. దీని ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మురాసు తుపాన్​ సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారం తెల్లవారుజామున తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 120 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. తుపాన్​ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభం అయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Murasu Cyclone | తెలంగాణలో..

తుపాను ప్రభావంతో నవంబర్ 3, 4, 5 తేదీల్లో దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. వాతావరణం మేఘావృతమై, చల్లగా ఉంటుంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం అర్ధరాత్రి వరకు మురాస్​ ప్రభావం తెలంగాణపై అధికంగా ఉంటుంది. నల్గొండ, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్​ ఉంది. ఇతర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. నవంబర్ 6 తర్వాత తెలంగాణ అంతటా వర్షాలు తగ్గుతాయి.

ఇది కూడా చదవండి..: Secunderabad railway fake currency | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ నకిలీ కరెన్సీ రాకెట్ రట్టు.. 19 ఏళ్ల కుర్రాడి వద్ద రూ.60 లక్షల దొంగ నోట్లు సీజ్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *