అక్షరటుడు వెబ్‌డెస్క్: NH-716 Pullampeta | పుల్లంపేట మీదుగా నిర్మించనున్న ఎన్‌హెచ్-716 (NH-716) నూతన హైవే విషయంలో అరటి, బొప్పాయి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ టీటీడీ బోర్డు సభ్యులు జి. భాను ప్రకాష్ రెడ్డి కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ( Nitin Gadkari )వారి నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక ప్రజలు, ముఖ్యంగా ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
NH-716 Pullampeta | కేంద్ర మంత్రి స్పందన..
రైతుల సమస్యపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అత్యంత సానుకూలంగా స్పందించారు. పుల్లంపేట ప్రాంతంలో రైతుల రాకపోకలకు, వాహనాల రవాణాకు వీలుగా తగిన విధంగా ఎంట్రీ, ఎగ్జిట్ సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆయన వెంటనే ఆదేశించారు.
NH-716 Pullampeta | డిమాండ్లు , సమస్యలు..
సరైన అండర్‌పాస్ (VUP) లేకపోవడం వల్ల పుల్లంపేట మండల కేంద్రంపై ఆధారపడిన చుట్టుపక్కల 40 గ్రామాల ప్రజలు, సుమారు 60,000 మంది నివాసితులు సుమారు 30 కిలోమీటర్లు అదనంగా చుట్టూ తిరగవలసి వస్తోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ట్రాక్టర్లు, ట్రక్కులు , అరటి, బొప్పాయి వంటి ఉద్యానవన ఉత్పత్తులను తరలించే వాహనాలు సురక్షితంగా వెళ్లేలా తగినంత ఎత్తు, వెడల్పుతో వీయూపీని డిజైన్ చేయాలని కోరారు. ఎన్ హెచ్-716 రోడ్డును పుల్లంపేట మండల కనెక్టింగ్ రోడ్డుతో అనుసంధానించేలా సురక్షితమైన ఎంట్రీ, ఎగ్జిట్ వసతులు, తగిన లైటింగ్, సైనేజ్‌లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
పుల్లంపేట రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రి తక్షణమే స్పందించడం స్థానిక రైతులకు, అరటి, బొప్పాయి సాగుదారులకు ఎంతో ఊరటనివ్వనుంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు కె. వెంకట సుబ్బయ్య యాదవ్, సి. శ్రీనివాసులు రెడ్డి, సి. మాధవ రెడ్డి, ఎ. లత ప్రసన్న, బి. రవి చంద్ర తదితరులు భాగస్వాములయ్యారు.
ఇది కూడా చదవండి: Danam Nagender Votes | హైదరాబాద్‌ను తగలబెడతాం.. దానం నాగేందర్ సంచలన హెచ్చరిక