Nov 19 Market Analysis | బేర్ గుప్పిట్లో గ్లోబల్ మార్కెట్లు..నష్టాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

బేర్ గుప్పిట చిక్కి ప్రధాన గ్లోబల్ మార్కెట్లు రక్తమోడుతున్నాయి. మన మార్కెట్లు సైతం నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nov 19 Market Analysis | ప్రధాన గ్లోబల్ మార్కెట్లు(Global markets) బేర్ గుప్పిట చిక్కి విలవిలలాడుతున్నాయి. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ మిశ్రమంగా ముగిసినా.. యూరోప్ మార్కెట్లు రక్తమోడాయి. గురువారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు భారీ నష్టాల దిశగా పయనిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Nov 19 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.42 శాతం లాభపడగా.. ఎస్ అండ్ పీ 0.23 శాతం నష్టపోయింది. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.35 శాతం లాభంతో ఉంది.

Nov 19 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.20 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.86 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 1.31 శాతం నష్టంతో ముగిశాయి.

Nov 19 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.34 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.15 శాతం లాభంతో, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.58 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.68 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.99 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.82 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.23 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా ఏడో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 5,866 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డీఐఐలు గత సెషన్‌లో రూ. 3,519 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు బలపడి 93.44 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 103.86 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.07 శాతం వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.12 నుంచి 0.94 కు తగ్గింది.
  • విక్స్ 15.52 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 92.11 డాలర్ల వద్ద ఉంది.
  • సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *