అక్షరటుడే, వెబ్డెస్క్ : Mahanadi Coalfields IPO | మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ దేశంలోనే అత్యధిక బొగ్గును ఉత్పత్తి చేసే సంస్థ. ఇది కోల్ ఇండియా పూర్తి యాజమాన్యం కలిగిన అనుబంధ సంస్థ. 1992 ఏప్రిల్ 3న ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి 2019లో ‘మినరత్న కేటగిరీ-1’ హోదా లభించింది.
2026 ఆర్థిక సంవత్సరంలో దేశీయ బొగ్గు ఉత్పత్తిలో ఈ సంస్థ వాటా 21 శాతంగా ఉంది. కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థలలో ఇదే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ కావడం గమనార్హం. ఈ సంస్థ అధీనంలో సుమారు 45 ఏళ్ల పాటు ఉత్పత్తి కార్యకలాపాలను కొనసాగించడానికి సరిపోయే నిల్వలు ఉన్నాయని అంచనా. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ఈ సంస్థలో 20,526 మంది ఉద్యోగులు, 27,113 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు.
Mahanadi Coalfields IPO | రూ. 8,981 కోట్ల ఇష్యూ..
మార్కె్ట్నుంచి రూ. 8,981.2 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్. ఐపీవో (IPO) ద్వారా వచ్చిన ఆదాయం పూర్తిగా ప్రమోటర్ సంస్థకే వెళ్తుంది.
Mahanadi Coalfields IPO | ధరల శ్రేణి..
కంపెనీ ధరల శ్రేణిని రూ. 129 నుంచి రూ. 136 మధ్య నిర్ణయించింది. ఒక లాట్లో 110 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్కోసం గరిష్ట ధర రూ. 136 వద్ద రూ. 14,960తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ అర్హులైన ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ. 6 ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తోంది.
Mahanadi Coalfields IPO | కోటా, జీఎంపీ..
క్యూఐబీలకు 50 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం కోటా కేటాయించారు. కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్లో డిమాండ్ పెద్దగా లేదు. ఒక్కో షేరు 2.28 శాతం ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది.
Mahanadi Coalfields IPO | ముఖ్యమైన తేదీలు..
ఐపీవో సబ్స్క్రిప్షన్ నవంబర్ 19న ప్రారంభమవుతుంది. బిడ్లు దాఖలు చేయడానికి 23వరకు అవకాశం ఉంది. నవంబర్ 25న షేర్ల అలాట్మెంట్ స్టేటస్ వెలువడనుంది. నవంబర్ 27న కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అవుతాయి.
ఇది కూడా చదవండి..: Nov 19 Market Analysis | బేర్ గుప్పిట్లో గ్లోబల్ మార్కెట్లు..నష్టాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ