Arunachalam Tour Package | ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్‌ ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి అరుణాచలంకు ప్రత్యేక రైళ్లు

పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని తీసుకువచ్చింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Arunachalam Tour Package | తమిళనాడు (Tamil Nadu)లోని అరుణాచలంను దర్శించుకునేవారి సంఖ్య పెరుగుతోంది. అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే పరమ శివుడి అనుగ్రహం లభిస్తుందన్నది భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో పరమపవిత్రమైన కార్తీక మాసంలో అరుణాచలం వెళ్లేందుకు భక్తులు క్యూకడుతున్నారు.

వారికోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్ – అరుణాచలం మోక్ష యాత్ర పేరుతో తీసుకువచ్చిన ఈ ప్యాకేజీలో.. అరుణాచలంతో పాటు కాంచీపురంలోని కామాక్షి అమ్మన్ ఆలయం, పుదుచ్చేరిలోని పర్యాటక ప్రదేశాల సందర్శన కూడా ఉంది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు ప్రతి శుక్రవారం రైలు అందుబాటులో ఉంటుంది. టూర్‌ 4 రాత్రులు, 5 రోజులు సాగుతుంది. ప్యాకేజీ వివరాలు తెలుసుకుందామా..

Arunachalam Tour Package | రైలు పేరు: కాచిగూడ – పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్.

టూర్‌ షెడ్యూల్‌..

మొదటి రోజు: శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కాచిగూడ నుంచి రైలు బయలుదేరుతుంది.
రెండో రోజు: శనివారం ఉదయం 11.05 గంటలకు రైలు పుదుచ్చేరి చేరుకుంటుంది. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత, ఆరోవిల్, అరబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్‌ సందర్శన ఉంటాయి. రాత్రికి పుదుచ్చేరిలోనే బస కల్పించారు.
మూడో రోజు: ఆదివారం ఉదయం భక్తులు పుదుచ్చేరి నుంచి అరుణాచలం చేరుకుంటారు. అరుణాచలేశ్వర శివ దర్శనం, గిరి ప్రదక్షిణ అనంతరం రాత్రి అరుణాచలంలోనే బస ఉంటుంది.
నాలుగో రోజు: సోమవారం ఉదయం కాంచీపురం వెళ్లి కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఏకాంబరేశ్వర ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత కాచిగూడకు తిరుగు ప్రయాణం.
ఐదో రోజు: మంగళవారం ఉదయం కాచిగూడ చేరుకుంటారు.

Arunachalam Tour Package | టికెట్ ధరలు..

రైలులో క్లాస్ థర్డ్ ఏసీ (3ఏసీ), స్లీపర్ క్లాస్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
థర్డ్ ఏసీ (3ఏసీ) టికెట్‌ ధరలు: ట్విన్ షేరింగ్ ఉంటే ఒక్కొక్కరికి రూ. 16,900, ట్రిపుల్ షేరింగ్ అయితే రూ. 13,210, పిల్లలకు(బెడ్‌తో) రూ. 10,030, పిల్లలకు బెడ్ లేకుండా రూ. 7,530.
స్లీపర్ క్లాస్ ధరలు: ట్విన్ షేరింగ్‌కు రూ. 14,820, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 11,125, పిల్లలకు(బెడ్‌తో) రూ. 7,950, పిల్లలకు(బెడ్‌ లేకుండా) రూ. 5,450.
ఈ టికెట్‌ రేటు ఒకరినుంచి ముగ్గురికి వర్తిస్తాయి. నలుగురిపైన గ్రూప్‌గా వెళ్తే ధర కాస్త తగ్గుతుంది.

వసతి/భోజనం : ప్యాకేజీలో భాగంగా రెండు రోజుల పాటు ఏసీ హోటల్‌లో బస కల్పిస్తారు. అల్పాహారం ఉచితం. స్థానిక ప్రయాణాలకు ఏసీ వాహనం, ఆలయ దర్శన రుసుము, ఇతర ప్రత్యేక పూజా ఖర్చులను ప్రయాణికులే భరించాలి. ఆసక్తిగలవారు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ (irctctourism.com) ద్వారా టికెట్టు బుక్‌ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి..: Air India plane crash | ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తుపై కేంద్రం కీలక ప్రకటన.. తుది నివేదికకు రంగం సిద్ధం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *