అక్షరటుడే, వెబ్‌డెస్క్: Air India plane crash | దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాద దర్యాప్తుపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక ప్రకటన చేసింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన విచారణ ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరుకుందని, త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను బహిర్గతం చేయనున్నట్లు సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది.
Air India plane crash | అసలేం జరిగిందంటే..
2025 జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక కారణాలతో కుప్పకూలిపోయింది. 2025లో జరిగిన ఈ ఘోర విమాన దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
Air India plane crash | 260 మంది దుర్మరణం
ఈ పెను విషాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. విమానం కూలిన ప్రాంతంలో భూమిపై ఉన్న మరో 19 మంది సామాన్యులు కూడా దుర్మరణం పాలయ్యారు. మొత్తం 260 మందిని బలిగొన్న ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
Air India plane crash | త్వరలోనే అసలు కారణాలు వెలుగులోకి
ఈ ప్రమాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ సందర్భంగా కేంద్రం తాజా అప్డేట్ ఇచ్చింది. దర్యాప్తు ప్రక్రియ దాదాపు పూర్తయిందని, విమానం కూలిపోవడానికి గల కచ్చితమైన సాంకేతిక, ఇతర కారణాలతో కూడిన తుది నివేదికను త్వరలోనే సమర్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. దీంతో ఈ ఘోర ప్రమాదానికి అసలు కారణమేంటో త్వరలోనే అధికారికంగా వెల్లడి కానుంది.