అక్షరటుడే, వెబ్డెస్క్: Nov 28 Horoscope | పలు రాశుల వారికి శనివారం (నవంబర్ 28, 2026) మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ, ఆర్థికంగా, వ్యక్తిగతంగా కలిసి వచ్చే రోజుగా కనిపిస్తోంది.
దూర ప్రాంతం నుంచి అందే శుభవార్తతో పాటు పెండింగ్ పనులు, ఖర్చులు, కుటుంబ సంబంధాలపై దృష్టి పెట్టాల్సిన వేళ ఇది. ఈ రోజుతో మీకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సానుకూల మార్పులు, ఆనందకరమైన క్షణాలు అందే అవకాశం ఉంది.
Nov 28 Horoscope | రాశుల వారీగా..
మేష రాశి: Nov 28 Horoscope | చాలాకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యను మీ చురుకుదనంతో పరిష్కరిస్తారు. ఆర్థిక లాభాలు వచ్చి, వాటిని దానధర్మాలకు ఖర్చు చేయడం వల్ల మానసిక తృప్తి లభిస్తుంది.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
ప్రయాణాలు భవిష్యత్ ప్రయోజనాలకు పునాది వేస్తాయి. భాగస్వామితో సాయంత్రం ఉల్లాసంగా గడిపినా, వారు పనిలో మునిగిపోవడం కాస్త నిరాశ కలిగించవచ్చు. స్నేహితుడి సాయంతో ఓ పెద్ద సమస్య నుంచి బయటపడతారు.
వృషభ రాశి: Nov 28 Horoscope | ఆరోగ్యం బాగుండటంతో స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు, కానీ ఆకస్మిక అనారోగ్యం కొంత ఒత్తిడి కలిగించే అవకాశం ఉంది. ఇంట్లో పండుగ వాతావరణం టెన్షన్లను దూరం చేస్తుంది. ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.
మిథున రాశి: Nov 28 Horoscope | మీ కష్టానికి కుటుంబ సభ్యుల సహకారం తోడై ఆశించిన ఫలితాలు సాధిస్తారు. తల్లిదండ్రుల సాయంతో ఆర్థిక సమస్యలు తీరుతాయి. కొత్తవారికి దూరంగా ఉంటూ, శ్రేయోభిలాషులతో సన్నిహితంగా ఉంటాయి.
కర్కాటక రాశి: Nov 28 Horoscope | ఖర్చులపై నిఘా ఉంచకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడిపుతారు. పాత విషయంపై భాగస్వామితో చిన్న గొడవ వచ్చినా చివరికి సర్దుకుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కాస్త అసంతృప్తి కనిపించవచ్చు.
సింహ రాశి: Nov 28 Horoscope | క్రీడలు, అవుట్డోర్ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా కొత్త ఉత్సాహాన్ని పొందుతారు. ఆర్థిక సమస్యలు తొలగిపోయి లాభాలు అందుకుంటారు. ఇంట్లో వాతావరణం కాస్త అసహనంగా ఉండవచ్చు. వైవాహిక జీవితాన్ని మెరుగుపరుచుకునే మీ ప్రయత్నాలు అంచనాలకు మించి సఫలమవుతాయి.
కన్యా రాశి: దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు. అయితే ఉద్యోగ, వ్యాపారాల్లో నిర్లక్ష్యం వల్ల ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది. పొరుగువారితో వివాదాలకు దూరంగా ఉంటూ సహనంతో వ్యవహరించండి. కొత్త ఆలోచనలు, తెలుసుకోవాలనే ఆసక్తి మీకు లాభాలను తెచ్చిపెడతాయి.
తులా రాశి : మీ ఆకర్షణీయమైన ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. డబ్బు పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వచ్చి, పొదుపు చేయగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి వల్ల కొత్త స్నేహితులు ఏర్పడతారు.
వృశ్చిక రాశి: ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తారు. కొత్త ఆలోచనలు, అనుభవజ్ఞుల సలహా మేరకు చేసే పెట్టుబడులు విజయాన్ని అందిస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం కాస్త మెరుగుపడి, వారి ప్రేమాభిమానాలు లభిస్తాయి. ప్రేమ బంధం వివాహ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి: గతంలో అప్పు తీసుకుని తిరిగి ఇవ్వని బంధువులకు మళ్లీ అప్పు ఇవ్వకపోవడమే మంచిది. పార్టీ లేదా వేడుకలలో మీరే ఆకర్షణగా నిలుస్తారు. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకపోవడమే మంచిది.
మకర రాశి: ఒత్తిడి నుంచి బయటపడతారు. చాలాకాలంగా రాని బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యం బాగుండటం కుటుంబ సభ్యులకు సంతోషాన్ని ఇస్తుంది, కానీ భాగస్వామి ఆరోగ్యంపై కొంత ఆందోళన కలగవచ్చు. భాగస్వామి చర్య వల్ల తొలుత ఇబ్బంది అనిపించినా, అది మంచికే జరిగిందని తర్వాత అర్థమవుతుంది. పిల్లలకు తగినంత సమయం కేటాయించండి.
కుంభ రాశి: పిల్లలతో గడపడం వల్ల సాయంత్రం ఉత్సాహంగా ఉంటుంది. డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వని వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. పెద్దలు, కుటుంబ సభ్యుల ఆప్యాయత లభిస్తుంది. ప్రేమలోని చిన్నపాటి సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు
మీన రాశి : మీ అద్భుతమైన మేధాశక్తి, సానుకూల ఆలోచనలు క్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి సహాయపడతాయి. స్నేహితుడికి పెద్ద మొత్తంలో అప్పు ఇస్తే ఆర్థిక ఇబ్బందుల్లో పడతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరి జీవితాన్ని కాపాడుతుంది, ఇది కుటుంబ సభ్యులు గర్వపడేలా చేస్తుంది.