అక్షరటుడే, వెబ్‌డెస్క్: Travel Bus Accident | ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా (Khammam District) తల్లాడ మండలంలో చోటు చేసుకుంది. ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు.
హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సు తల్లాడ మండలం రామానుజవరం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Travel Bus Accident | పెరుగుతున్న ప్రమాదాలు
ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున హైవేలపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చలికాలం కావడంతో పొగమంచు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారులపై అతివేగంగా వాహనాలను నడుపుతుండటం, పొగ మంచుతో ముందు ఉన్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: STP Maintenance | ఎస్‌టీపీల లోపాలు సరిదిద్దుకోవాలి : హైడ్రా కమిషనర్