అక్షరటుడే, వెబ్డెస్క్: Food Safety Raids | దసరా, దీపావళి పండుగల సమయంలో ప్రజలు స్వీట్లు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు కల్తీ ఆహార పదార్థాలు, అపరిశుభ్ర పరిస్థితుల్లో మిఠాయిలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అలాంటి వారిపై టీజీ సేఫ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
నగరంలోని పలు మిఠాయి తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్ అధికారులు గురువారం దాడులు చేశారు. ఏడు బృందాలు హైదరాబాద్ (Hyderabad) పరిసర ప్రాంతాల్లోని ఏడు కోవా, మిఠాయి తయారీ, రిటైల్ యూనిట్లను తనిఖీ చేశాయి. కల్తీ జరిగినట్లు అనుమానంతో అధికారులు ఎనిమిది నమూనాలను సేకరించారు. నిబంధనలు పాటించని మూడు మిఠాయి తయారీ యూనిట్ల లైసెన్సులను అధికారులు రద్దు చేశారు.
Food Safety Raids | ఈ సంస్థలలో..
జీడిమెట్లలోని భాగ్య లక్ష్మి స్వీట్స్ అండ్ బర్ఫీ, బాలాజీ మ్యాజిక్ మిఠాయి, యశోద డైరీ, కీసర మండలం చీర్యాల్లోని మధుర డైరీ ప్రొడక్ట్స్, జల్పల్లిలోని దేశీ డైరీ స్వీట్స్, పీర్జాదిగూడలోని జగన్నాథ్ మిల్క్ డైరీ, బేలా, శాలిబండలోని శంకర్ యాదవ్ కోవా అండ్ పనీర్ మర్చంట్ సంస్థలలో అధికారులు తనిఖీలు చేశారు.
Food Safety Raids | ఈగలు, ఎలుకలు
అపరిశుభ్ర పరిస్థితుల్లో స్వీట్లు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిలిచిపోయిన నీరు, ఈగలు, ఎలుకల బెడద, ఆహారం తయారుచేసే ప్రదేశాలలో గుట్కా, పాన్ మసాలా ప్యాకెట్లు, ఉమ్మి మరకలు ఉన్నాయి. కార్మికులు హెయిర్నెట్లు, గ్లౌజులు లేకుండా ఆహారాన్ని తయారు చేస్తున్నారు. దీంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్య లక్ష్మి స్వీట్స్ అండ్ బర్ఫీ, బాలాజీ మ్యాజిక్ మిఠాయి, యశోద డైరీల లైసెన్సులను అధికారులు నిలిపివేశారు.
ఇది కూడా చదవండి..: PVNR Expressway | ఒకదానిని ఒకటి ఢీకొన్న ఆరు కార్లు