PVNR Expressway | ఒకదానిని ఒకటి ఢీకొన్న ఆరు కార్లు

హైదరాబాద్‌లోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరు కార్లు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PVNR Expressway | హైదరాబాద్‌ (Hyderabad)లోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరు కార్లు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి.

మెహదీపట్నం వైపు నుంచి ఆరాంఘర్​ వైపు వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి పిల్లర్​ నంబర్​ 131 వద్ద డివైడర్‌పైకి దూసుకెళ్లి స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. దాని వెనుక వస్తున్న ఐదు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకుని ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాదాన్ని చూసి ఓ కారు డ్రైవర్​ సడన్ బ్రేక్​ వేయడంతో మిగతా కార్లు దానిని ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరు కార్లు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

PVNR Expressway | భారీగా ట్రాఫిక్​ జామ్​

నిత్యం రద్దీగా ఉండే పీవీఎన్​ఎర్​ ఎక్స్​ప్రెస్​ వేపై ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్​ జామ్​ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, దెబ్బతిన్న వాహనాలను తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కాగా ఎక్స్​ప్రెస్​ వేపై కొందరు అతివేగంగా దూసుకు వెళ్తారు. ఈ క్రమంలోనే తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇది కూడా చదవండి..: HYDRAA Land Protection | రూ.400 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *