అక్షరటుడే, వెబ్‌డెస్క్: Oct 18 Horoscope | దుర్గాష్టమి వేళ నేడు (ఆదివారం, అక్టోబరు 18) రాశి ఫలాల ప్రకారం.. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక, కుటుంబ, వ్యక్తిగత జీవితంలో మిశ్రమ ఫలితాలు ఎదురుకానున్నాయి.
అమ్మవారి కృపతో కొన్ని రాశుల వారికి ఊహించని ధనలాభాలు, కొత్త పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తే, మరికొందరికి ఖర్చులు, ఆరోగ్య విషయంలో అప్రమత్తత అవసరం. విద్యార్థులు, ఉద్యోగులు తమ లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన కీలక రోజు ఇది.
Oct 18 Horoscope | రాశుల వారీగా..
మేష రాశి: Oct 18 Horoscope | స్నేహితుల ద్వారా మీ ఆలోచనా విధానాన్ని మార్చే ప్రత్యేక వ్యక్తి పరిచయం అవుతారు. విలాసాల కోసం ఖర్చులు విపరీతంగా పెరగకుండా ఆర్థిక నియంత్రణ పాటించడం చాలా ముఖ్యం. జీవిత భాగస్వామి అనారోగ్య కారణంగా కొంత ఆందోళన చెందుతారు.
వృషభ రాశి: Oct 18 Horoscope | మీ విలువైన చరాస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి, దొంగతనాలు జరిగే సూచనలు ఉన్నాయి . డబ్బు పెట్టుబడుల విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. జీవిత భాగస్వామి చక్కటి సర్ ప్రైజ్ ఇస్తారు.
మిథున రాశి: Oct 18 Horoscope | సానుకూల దృక్పథంతో ఉత్సాహంగా రోజును ప్రారంభిస్తారు, అయితే ముఖ్యమైన వస్తువు పోగొట్టుకోవడం వల్ల కాస్త మూడ్ మారుతుంది. ఆధ్యాత్మిక భావనలు పెరిగి గురువులను కలుసుకునే అవకాశం ఉంది.
కర్కాటక రాశి: Oct 18 Horoscope | చాలాకాలంగా వేధిస్తున్న అనారోగ్యం నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపార రంగాలలో తండ్రి సలహాలు మీకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. ఇవాళ ఒక ప్రత్యేక వ్యక్తిని కలుసుకునే అద్భుతమైన అవకాశం ఉంది. ప్రయాణాలకు నేడు అనుకూలమైన రోజు కాదు. కుటుంబంలో ఆనందం కోసం ప్రతిరోజూ ఉదయం ‘ఓం క్రామ్ క్రీమ్ క్రౌమ్ సః బౌమాయ నమః’ మంత్రాన్ని 11 సార్లు జపించండి.
సింహ రాశి: Oct 18 Horoscope | సన్నిహిత సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు రావడం వల్ల ఇవాళ టెన్షన్‌గా గడుస్తుంది. ధనానికి సంబంధించి జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు రావచ్చు. కుటుంబంతో కలిసి సామాజిక కార్యక్రమాలలో పాల్గొని ఆనందం పొందుతారు.
కన్యా రాశి: Oct 18 Horoscope | మీ వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటుంది. పాత మిత్రుడు ఆర్థిక సహాయం కోరే అవకాశం ఉంది, దీనివల్ల చిన్నపాటి భారం పడవచ్చు. మీ శక్తిని పునరుజ్జీవింపజేసే వినోదయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
తులా రాశి: Oct 18 Horoscope | పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి, అనారోగ్య సమస్యల కారణంగా వైద్య ఖర్చులు రావచ్చు. ప్రియమైన వారి పట్ల మీ కఠినమైన ప్రవర్తన వారిలో వ్యతిరేకతను పెంచవచ్చు. మనశాంతి కోసం మంచి నవలలు చదువుతూ ఏకాంతంగా గడుపుతారు.
వృశ్చిక రాశి: స్నేహితులు మీకు తోడుగా నిలిచి సంతోషాన్ని ఇస్తారు. చుట్టుపక్కల వారు ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే అవకాశం ఉంది. పిల్లల నుండి కొన్ని ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. జీవిత భాగస్వామి మీకు అందమైన సర్ప్రైజ్ ఇస్తారు.
ధనుస్సు రాశి: ఇవాళ మీకు ఒక సంతోషకరమైన శుభవార్త అందుతుంది. ఎవరికీ అప్పు ఇవ్వకపోవడమే మంచిది. మీ మనసుకు నచ్చే ఒక ప్రత్యేక వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంది. సంగీత వాయిద్యాలు వింటూ లేదా వాయిస్తూ రోజును ఆనందంగా గడుపుతారు.
మకర రాశి: మీ కోపం చిన్న సమస్యను కూడా పెద్దదిగా మార్చి కుటుంబాన్ని అప్సెట్ చేయవచ్చు, కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి. రియల్ ఎస్టేట్ రంగంలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇవాళ మంచి రోజు. అతిథుల రాకతో సాయంత్రం వేళ సందడిగా గడుపుతుంది.
కుంభ రాశి: కుటుంబ సభ్యులు , సన్నిహిత స్నేహితులతో ఆనందంగా గడపుతారు. ఊహించని ఆర్థిక లాభాలు అందే సూచనలున్నాయి. విద్యార్థులు ఆటల పట్ల అతిగా ఆసక్తి చూపి చదువును నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది.
మీన రాశి: తోబుట్టువుల సహాయసహకారాల ద్వారా మంచి ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. దూరపు బంధువుల నుంచి వచ్చే అనుకోని శుభవార్త కుటుంబంలో అందరికీ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మంచి పనులు, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపి, వాటికోసం కొంత సమయం కేటాయిస్తారు.”