Rahul Gandhi BJP Criticism | రాహుల్​ గాంధీపై బీజేపీ విమర్శలు

ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్​ గాంధీ చేసిన పోస్ట్​పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rahul Gandhi BJP Criticism | రాహుల్​ గాంధీపై బీజేపీ నేతలు విమర్శలు చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశించిన ఆయన చేసిన పోస్ట్​కు కౌంటర్​ ఇచ్చారు. రాజీ పడటంతో కాంగ్రెస్​కు అలవాటని పేర్కొన్నారు.

అపెక్​ సదస్సులో భాగంగా గురువారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump)​, రష్యా అధ్యక్షుడు పుతిన్​, చైనా ప్రెసిడెంట్​ జింగ్​పింగ్ సమావేశం అయ్యారు. ఈ త్రైపాక్షిక సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముగ్గురు నేతల భేటీ ఫొటోను రాహుల్​ గాంధీ ఎక్స్​లో పోస్ట్​ చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే, భారత ప్రధానమంత్రి సైతం ఆ మీటింగ్​లో ఉండేవారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ కాంప్రమైజ్​ అయిన ప్రధానికి ఎప్పటికీ ఆ బల్లపై కూర్చోలేరన్నారు. దీనికి బీజేపీ నేతలు కౌంటర్​ ఇస్తున్నారు.

Rahul Gandhi BJP Criticism | డబ్బులు తీసుకుంటున్న రాహుల్​

గాంధీ పోస్ట్‌పై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ, గత కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీసిందని ఆరోపించింది. ఇందిరా గాంధీ ప్రభుత్వం పాకిస్థాన్ యుద్ధ ఖైదీలను విడుదల చేయడాన్ని, మన్మోహన్ సింగ్ హయాంలోని షర్మ్-ఎల్-షేక్ ప్రకటనను బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా ప్రస్తావించారు. సిమ్లా ఒప్పందం సమయంలో ఇందిరా గాంధీ రాజీపడ్డారని, ఆమె పాకిస్థాన్ సైనికులను విడుదల చేశారన్నారు. దేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికి రాహుల్ గాంధీకి డబ్బులు ఇస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు.

ఇది కూడా చదవండి..: Gangster Naseem Durrani killed | పోలీసుల తూటాలకు నేలకొరిగిన దావూద్ ఇబ్రహీం అనుచరుడు.. జాయింట్ ఆపరేషన్‌లో గ్యాంగ్‌స్టర్ నసీమ్ దుర్రానీ హతం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *