అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | అమెరికా -ఇరాన్‌ల ఉద్రిక్తతలు పెరగడం, ముడి చమురు ధరలు అధికమవడం వంటి పరిణామాల నేపథ్యంలో గత సెషన్లో భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market).. బుధవారం ఒడిదుడుకుల మధ్య సాగినా చివరికి స్వల్ప లాభాలతో ముగిసింది. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ రాణించాయి. మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుంటాయన్న అంచనాలతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఆటో స్టాక్స్‌లో వాల్యూ బయ్యింగ్ కనిపించింది.
Stock Market | ఇతర కారణాలు..
అమెరికా ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. ద్రవ్యోల్బణం అంచనాలకన్నా తక్కువగా నమోదవడంతో ఈ ఏడాది యూఎస్ ఫెడరల్ రిజర్వ్ భారీగా వడ్డీ రేట్లను పెంచకపోవచ్చన్న అభిప్రాయం ఇన్వెస్టర్లలో వ్యక్తమవుతోంది. దీనికితోడు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై 20 శాతం రవాణా రుసుమును ప్రకటించిన ఒకరోజు తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దానిని ఉపసంహరించుకోవడమÖ మార్కెట్ సెంటిమెంట్ బలపడడానికి కారణమైంది.
Stock Market | లాభాలతో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 138 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 454 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో 664 పాయింట్లు పడిపోయింది. 33 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ.. 135 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 2310 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో 77,185 వద్ద, నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 24,078 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,297 కంపెనీలు లాభపడగా 1,974 స్టాక్స్ నష్టపోయాయి. 171 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 120 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 71 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 18 స్టాక్ లాభపడగా.. 12 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్ 3.08 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.77 శాతం, ఎస్బీఐ 1.50 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.49 శాతం, ఇండిగో 1.09 శాతం లాభపడ్డాయి.
Top Losers : పవర్‌గ్రిడ్ 1.73 శాతం, ఎల్టీ 1.69 శాతం, టాటా స్టీల్ 1.65 శాతం, ఇన్ఫోసిస్ 1.41 శాతం, ఎన్టీపీసీ 1.12 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Realme Narzo 100x | భారీ బ్యాటరీతో రియల్మీ ఫోన్.. ధర ఎంతంటే?