Swathi Second Marriage | రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్ స్వాతి.. దర్శకుడు శ్రీకాంత్ నాగోతితో కొత్త జీవితానికి శ్రీకారం

ఇద్దరూ విడిపోయారనే వార్తలు చాలా కాలంగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నప్పటికీ, ఆ విషయంపై స్వాతి ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Swathi Second Marriage | ప్రముఖ నటి స్వాతి రెడ్డి (కలర్స్ స్వాతి) తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ‘మంత్ ఆఫ్ మధు’ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని వివాహం చేసుకున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో సినీ వర్గాలతో పాటు అభిమానులు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Pritam Pedro Review | హైటెక్ హ్యాకర్.. పాతకాలపు పోలీస్.. ఓటీటీలో నవ్వులు పూయిస్తున్న ‘జనరేషన్ గ్యాప్’ : ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ ఎలా ఉందంటే?

South Actress Swathi Reddy Dressing Style Outfits

Swathi Second Marriage | గతంలో వాసుతో ప్రేమ వివాహం

స్వాతి గతంలో మలయాళీ పైలట్ వికాస్ వాసుతో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ విడిపోయారనే వార్తలు చాలా కాలంగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నప్పటికీ, ఆ విషయంపై స్వాతి ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు.

ఇటీవల సినిమాల్లో రీ-ఎంట్రీ ఇచ్చిన స్వాతి, ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించారు. అదే సినిమా దర్శకుడు శ్రీకాంత్ నాగోతితో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు అధికారికంగా ప్రకటించడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

సోషల్ మీడియాలో ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన స్వాతి, శ్రీకాంత్ నాగోతి దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *