అక్షరటుడే వెబ్‌డెస్క్: V-Rich Tadka Ghee | ఆధునిక జీవనశైలిలో బిజీ గడుపుతున్న వారి కోసం హైదరాబాద్‌కు చెందిన ‘క్లీన్-లేబుల్’ ఫుడ్ బ్రాండ్ వి-రిచ్ (V-Rich) ఒక సరికొత్త ఉత్పత్తును తీసుకువచ్చింది. వంటగదిలో శ్రమ లేకుండా, క్షణాల్లో అచ్చమైన పోపు రుచిని అందించేలా ‘ఇన్‌స్టంట్ తడ్కా నెయ్యి’ని హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల చేసింది. సంప్రదాయ వంటకాల రుచిని, ఇపటి బిజీ లైఫ్‌స్టైల్‌కు తగినట్లుగా సులభంగా అందించడమే ఈ ఆవిష్కరణ ప్రధాన ఉద్దేశం.
V-Rich Tadka Ghee | తాలింపు టెన్షన్ ఇక దూరం..
భారతీయుల ప్రతి వంటకంలోనూ తాలింపు (పోపు)కు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. అయితే, పోపు దినుసులు సిద్ధం చేయడం, నూనె చిమ్మడం, ఆ తర్వాత వంటగదిని శుభ్రం చేసుకోవడానికి సమయం లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా వి-రిచ్ ఈ తడ్కా నెయ్యిని రూపొందించింది. స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో అచ్చమైన పోపు దినుసులను వేయించి, ఆ సువాసన చెడిపోకుండా ఈ జార్‌లో పదిలంగా ఉంచారు.
ఎంతో నాణ్యతతో కూడిన ఈ తడ్కా నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు వంటి 7 రకాల పోపు దినుసులు ఉంటాయి. వేడి వేడి అన్నం, పప్పు, కిచిడీ, ఉప్మా లేదా ఏ కూరలోనైనా ఒక చెంచా ఈ నెయ్యి వేసుకుంటే చాలు.. అచ్చం ఇంట్లో వేసిన తాలింపు రుచి, గుమగుమలాడే సువాసన క్షణాల్లో మీ వంటకానికి సొంతమవుతుంది. రసాయనాలు లేదా కృత్రిమ ప్రిజర్వేటివ్స్ ఏవీ లేకుండా దీనిని పూర్తిగా సహజసిద్ధంగా తయారు చేశారు.
V-Rich Tadka Ghee | ఇన్‌స్టంట్ తడకా నెయ్యి..
ఈ కొత్త ఆవిష్కరణపై వి-రిచ్ వ్యవస్థాపకురాలు, సీఈఓ యోగితా జాహ్నవి మాట్లాడుతూ.. “వంటలో తాలింపు చాలా ముఖ్యమైన భాగం. బిజీ షెడ్యూల్ కారణంగా ప్రతిసారీ అన్ని దినుసులను వేయించి తాలింపు పెట్టుకోవడం కుదరకపోవచ్చు. ఆ సమస్యను సులభతరం చేయడానికే ఈ ఇన్‌స్టంట్ తడకా నెయ్యిని తీసుకువచ్చాం. ఎలాంటి ప్రాసెస్డ్ పదార్థాలు లేకుండా మన సంప్రదాయ వంటింటి విజ్ఞానాన్ని ఇది అందిస్తుంది” అని వివరించారు.
వి-రిచ్ ఇన్‌స్టంట్ తడ్కా నెయ్యి 250ml జార్ ధర రూ. 449గా ఉంది. ఇది కంపెనీ అధికారిక వెబ్‌సైట్ (www.vrich.in) , అమెజాన్ ద్వారా దేశవ్యాప్తంగా లభిస్తుంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా బ్లింకిట్ (Blinkit) యాప్ ద్వారా క్షణాల్లో ఆర్డర్ చేసుకోవచ్చు. త్వరలోనే ఇతర మెట్రో నగరాలకు కూడా దీనిని విస్తరించనున్నారు. వి-రిచ్ వద్ద ఇన్‌స్టంట్ తడ్కా నెయ్యితో పాటు అశ్వగంధ, శతావరి, పసుపు కలిగిన నెయ్యి, అల్లం, పసుపు, ఇమ్యూనిటీ తేనె వంటి అనేక సహజసిద్ధమైన ఆరోగ్యకరమైన ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: CBSE Three Language Policy | త్రిభాషా విధానం పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు