Yoga Competitions | నందిపేట్​లో జిల్లాస్థాయి యోగాసన పోటీలు

నందిపేట్​లో జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్​ అధ్యక్షుడు ఐశ్వర్య కాళె తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Yoga Competitions | జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి యోగా (YOGA) పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్​ అధ్యక్షుడు ఐశ్వర్య కాళె తెలిపారు. ఈ మేరకు ప్రతినిధులు ఆదివారం వివరాలు వెల్లడించారు.

Yoga Competitions | నందిపేట్​లోని ఉజ్వల హైస్కూల్​లో..

నందిపేట్​లోని ఉజ్వల హైస్కూల్​లో 17వ జిల్లాస్థాయి యోగాసన పోటీలను (Yogasana competition) నిర్వహిస్తున్నట్లు ఐశ్వర్య తెలిపారు. ఈ పోటీలు ఎనిమిదేళ్ల నుంచి నుండి 80ఏళ్ల వయస్సు ఉన్న యోగా క్రీడాకారులకు వివిధ కేటగిరీల్లో బాలబాలికలు, మహిళలు, పురుషులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే వారు ముందుగా ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, రిజిస్ట్రేషన్ కాపీలు, మూడు పాస్​పోర్ట్​ సైజ్​ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. ఈ పోటీల గెలుపొందిన క్రీడాకారులు సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన సమాచారం కోసం ఐశ్వర్య కాళె (8106420241), టీవీ ప్రవీణ్ నాయుడు, సెక్రటరీ గంగాధర్ (8074982200)లలో సంప్రదించాలని సూచించారు.

ఇది కూడా చదవండి: విశ్వ రహస్యాలను ఛేదించేందుకు నాసా మరో అడుగు.. అంతరిక్షంలోకి ‘మూడో కన్ను’

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *