నిజామాబాద్Shivaji Statue Installation | మోతెలో 12 అడుగుల శివాజీ విగ్రహం ఏర్పాటు..

Shivaji Statue Installation | మోతెలో 12 అడుగుల శివాజీ విగ్రహం ఏర్పాటు..

వేల్పూర్ మండలంలోని మోతె గ్రామంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఏర్పాటు చేయనున్నారు. సోమవారం విగ్రహ తయారీదారుని ప్రతినిధుల బృందం కలిసింది.

అక్షరటుడే, భీమ్​గల్(​వేల్పూర్): Shivaji Statue Installation | వేల్పూర్ మండలంలోని మోతె గ్రామంలో (Mothe Village) ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. గ్రామంలో 12 అడుగుల భారీ శివాజీ విగ్రహాన్ని (Shivaji Statue) ప్రతిష్ఠించాలని గ్రామస్థులు నిర్ణయించగా, ఇందుకు సంబంధించిన తయారీ పనులను ప్రముఖ శిల్పి శ్రీనివాస్‌కు అప్పగించారు. సోమవారం విగ్రహ తయారీదారుని కలిసిన ప్రతినిధుల బృందం, విగ్రహ తయారీకి సంబంధించి ఆర్డర్ ఇచ్చారు.

Shivaji Statue Installation | ​సొంత ఖర్చుతో విగ్రహ ప్రతిష్ట

ఈ విగ్రహ ఏర్పాటుకు అయ్యే పూర్తి ఖర్చును ప్రముఖ దాత అల్లపుల్ల గంగారెడ్డి భరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివాజీ మహరాజ్ ఆదర్శాలను నేటి యువతకు చాటిచెప్పేలా గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విగ్రహ తయారీకి అయ్యే రూ. 2,25,000 మొత్తాన్ని తానే స్వయంగా భరిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి తొలి విడతగా తయారీదారు శ్రీనివాస్‌కు అడ్వాన్స్ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మోతె గ్రామ ఉపసర్పంచ్ కర్రోల్ల పరంజ్యోతి కుమార్, దామ సాయన్న, మేర మహేష్ తదితరులు పాల్గొన్నారు.

shivaji

ఇది కూడా చదవండి..: Prajavani Complaints | ప్రజావాణికి 91 ఫిర్యాదులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...