తెలంగాణHILTP Portal Launch | హిల్ట్​ పాలసీ పోర్టల్​ ప్రారంభించిన ప్రభుత్వం

HILTP Portal Launch | హిల్ట్​ పాలసీ పోర్టల్​ ప్రారంభించిన ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ పారిశ్రామిక భూముల పరివర్తన విధానం (HILTP) పోర్టల్‌ను ప్రారంభించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HILTP Portal Launch | తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ పారిశ్రామిక భూముల పరివర్తన విధానం (HILTP) పోర్టల్‌ను ప్రారంభించింది. సమాచార సాంకేతిక, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) ఈ విధానం కింద ప్రయోజనాలను పొందాలనుకునే అర్హతగల పారిశ్రామిక యూనిట్ల నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి ఉద్దేశించిన ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించారు.

హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని 21 ఇండస్ట్రియల్ పార్కులు, స్వతంత్ర యూనిట్లలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమల తరలింపును సులభతరం చేయడానికి ఈ పోర్టల్ రూపొందించారు. 10శాతం ముందస్తు అభివృద్ధి ప్రభావ రుసుము (DIF) చెల్లింపు, జూన్ 30లోపు తమ దరఖాస్తులను సమర్పించే దరఖాస్తుదారుల కోసం ప్రస్తుత SRO మార్కెట్ రేట్లను పరిగణనలోకి తీసుకోవడం చేయనున్నట్లు తెలిపింది.

HILTP Portal Launch | ఆన్​లైన్​లో దరఖాస్తులు

కొత్తగా ప్రారంభించిన డిజిటల్ పోర్టల్, అర్హులైన పారిశ్రామిక యూనిట్ హోల్డర్లకు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి, పర్యవేక్షించడానికి ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది పారదర్శక, సాంకేతికత ఆధారిత మరియు పౌర-కేంద్రీకృత పాలన పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుందని మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు.

దీనిని కూడా చదవండి : Caste Names Change | ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ కులాల పేర్లు మార్పు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Telangana Cabinet Decisions | రెండో విడత ఇళ్లు.. కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యాలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Cabinet Decisions | తెలంగాణలో రెండో విడ‌త...

Kochi sex racket | రంగుల కల చూపి.. నరకంలోకి నెట్టి.. మోడలింగ్ పేరిట అంతర్జాతీయ సెక్స్ రాకెట్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kochi sex racket | అవకాశాల ఆకాశంలో స్వేచ్ఛగా...