జాతీయంKochi sex racket | రంగుల కల చూపి.. నరకంలోకి నెట్టి.. మోడలింగ్ పేరిట అంతర్జాతీయ...

Kochi sex racket | రంగుల కల చూపి.. నరకంలోకి నెట్టి.. మోడలింగ్ పేరిట అంతర్జాతీయ సెక్స్ రాకెట్!

వారి బలహీనతలను, నగ్న వీడియోలను రికార్డు చేసి, "ఎవరికైనా చెబితే సమాజంలో తలెత్తుకోకుండా చేస్తాం" అంటూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. భయం, అవమానం, సామాజిక అపవాదు అనే ఆయుధాలతో ఆ అభాగ్యుల గొంతు నొక్కేశారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kochi sex racket | అవకాశాల ఆకాశంలో స్వేచ్ఛగా విహరించాలని ఆశపడ్డారు. గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోతూనే, కుటుంబానికి చేదోడుగా నిలవాలనుకున్నారు.

కానీ, ఆ రంగుల కలల వెనుక దాగున్న నరకకూపాన్ని ఆ అమాయకులు ఊహించలేకపోయారు. మోడలింగ్, ఉద్యోగాల Jobs పేరిట యువతులను విదేశాలకు తరలించి, వారి జీవితాలను ఛిద్రం చేస్తున్న అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) ముఠా గుట్టును కేరళ రాష్ట్రంలోని కొచ్చి పోలీసులు రట్టు చేశారు.

బాధితుల్లో ఇద్దరు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఉదంతం వెలుగుచూసింది. సమాజంలో పెరుగుతున్న ఆధునిక బానిసత్వానికి, క్రూరత్వానికి ఈ ఘటన అద్దం పడుతోంది.

Kochi sex racket | ఫ్యాషన్ షోలలో గుర్తింపు తెస్తామని..

నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా, గ్లామర్ ప్రపంచం యువతను ఎంతగా ఆకర్షిస్తున్నాయో.. అంతే సులభంగా నేరగాళ్ల వలలో చిక్కుకుని శల్యమవుతున్నారు.

యువతులకు నిందితులు ఫ్యాషన్ షోలలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెస్తామని, బ్యూటీ పార్లర్లలో నెలకు భారీ వేతనంతో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. గల్ఫ్ దేశాలకు విజిటింగ్ వీసాలపై తీసుకెళ్లి, అక్కడ అసలు రంగు బయటపెట్టారు.

దుబాయ్ Dubai లాంటి నగరాల్లోని రహస్య అపార్ట్‌మెంట్లలో యువతులను బంధించి, వారి పాస్‌పోర్టులు, ఫోన్లను లాక్కున్నారు. అంతటితో ఆగక, వారికి మత్తు పానీయాలు ఇచ్చి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి, బలవంతంగా వ్యభిచారంలోకి దించారు.

వారి బలహీనతలను, నగ్న వీడియోలను రికార్డు చేసి, “ఎవరికైనా చెబితే సమాజంలో తలెత్తుకోకుండా చేస్తాం” అంటూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. భయం, అవమానం, సామాజిక అపవాదు అనే ఆయుధాలతో ఆ అభాగ్యుల గొంతు నొక్కేశారు.

Kochi sex racket | సిట్ (SIT) ఏర్పాటు

ఈ కేసు కేవలం ఒక ప్రాంతానికో, నగరానికో పరిమితమైంది కాదు. దీని వెనుక అంతర్జాతీయ క్రిమినల్ గ్యాంగుల, అండర్‌వరల్డ్ ముఠాల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

బాధితులను సరఫరా చేసిన స్థానిక ఏజెంట్లకు ఈ ముఠా భారీగా డబ్బులు చెల్లించినట్లు తేలింది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కొచ్చి పోలీస్ కమిషనర్, దీనిపై సమగ్ర విచారణ కోసం డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు.

ఇప్పటికే ఈ ముఠాకు చెందిన ముగ్గురు కీలక నిందితులను (అలీనా అబ్రహం, తోయిసి సింధు, మంజిమ) పోలీసులు అరెస్టు చేశారు. విదేశాల్లో తలదాచుకున్న మరో ఇద్దరు నిందితుల కోసం ఇంటర్‌పోల్ (Interpol) సహాయం తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Kochi sex racket | సున్నితత్వం ఎటు పోతోంది?

ఈ ఘటన కేవలం ఒక నేర సమాచారం మాత్రమే కాదు.. ఇది సమాజం ఆలోచించాల్సిన ఒక మానవీయ సంక్షోభం. కన్నవారిని సాకాలని, తమ కాళ్లపై తాము నిలబడాలని తపించే శ్రామిక, మధ్యతరగతి యువతుల అమాయకత్వాన్ని ఈ రాకెట్ పెట్టుబడిగా మార్చుకుంది.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, ఆ ముఠా చెరనుంచి తప్పించుకుని స్వదేశానికి చేరిన ఆ ఇద్దరు యువతులు చూపిన ధైర్యం సామాన్యమైంది కాదు. తమలాంటి మరెందరో ఆడపిల్లలు ఆ నరకంలో మగ్గిపోకూడదనే ఉద్దేశంతో, సామాజిక అవమానాలను ఎదిరించి వారు పోలీసులను ఆశ్రయించారు.

Kochi sex racket | సమాజానికి హెచ్చరిక

మనుషుల అక్రమ రవాణా, ముఖ్యంగా మహిళలను లైంగిక దాస్యంలోకి నెట్టడం అనేది మానవత్వానికే ఒక మాయని మచ్చ. చదువుకున్న కేరళ సమాజంలోనే మోడలింగ్ ముసుగులో ఇంతటి దారుణం జరిగిందంటే.. దేశవ్యాప్తంగా ఇలాంటి నెట్‌వర్క్‌లు ఎంతగా వేళ్లూనుకున్నాయోననే ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఈ ఘటన ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తోంది. ఆన్‌లైన్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల ఆఫర్లు, సులభంగా డబ్బు సంపాదించే మార్గాల పట్ల యువత, ముఖ్యంగా వారి తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన గుర్తుచేస్తోంది.

ప్రభుత్వాలు, చట్టాలు ఎంత కఠినంగా వ్యవహరించినా.. సమాజంలో అప్రమత్తత, బాధితులకు అండగా నిలిచే మానవత్వం ఉన్నప్పుడే ఇలాంటి చీకటి ముఠాల ఆటకట్టించడం సాధ్యమవుతుంది. మాయమాటల వెనుక దాగున్న విషాన్ని గుర్తించడమే మన ఆడబిడ్డల భద్రతకు శ్రీరామరక్ష!

Jukkal MLA Comments | పోలీస్ vs ప్రజాప్రతినిధులు! అధికార పక్షంలో…

BC Leader Targeted | కులాధిపత్య మీడియా ‘కుట్రల’ బట్టబయలు: బీసీ…

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Telangana Cabinet Decisions | రెండో విడత ఇళ్లు.. కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యాలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Cabinet Decisions | తెలంగాణలో రెండో విడ‌త...

HILTP Portal Launch | హిల్ట్​ పాలసీ పోర్టల్​ ప్రారంభించిన ప్రభుత్వం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HILTP Portal Launch | తెలంగాణ ప్రభుత్వం...