అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran US Peace Deal | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య దాదాపు శాంతి ఒప్పందం ఖరారు అయింది. దీంతో హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) క్రమంగా తెరుచుకోనుంది. 60 రోజుల కాలవ్యవధిలో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
ఇరాన్–అమెరికా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణంసైతం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి నుంచి నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో గ్యాస్, ముడి చమురు రవాణా నిలిచిపోయింది. ఈ క్రమంలో రెండు దేశాల చర్చల కోసం ప్రపంచం మొత్తం ఉత్కంఠగా చూస్తోంది. ఈ క్రమంలో శాంతి చర్చలు కొలిక్కిరావడం గమనార్హం.
Iran US Peace Deal | చర్చల దశలో..
యుద్ధ పరిష్కార ప్రయత్నాలలో అమెరికా, ఇరాన్ పురోగతిని సూచిస్తున్నప్పటికీ, ఒక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందానికి సంబంధించిన కీలక వివరాలు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. దీనిని ఖరారు చేయడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చని సమాచారం. ఒప్పందం దగ్గరలోనే ఉందని, అయితే కొనసాగుతున్న చర్చల సమయంలో ఇరాన్ ఓడరేవులపై అమెరికా నావికా దిగ్బంధనం కొనసాగుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెప్పారు. దీర్ఘకాలిక ఒప్పందాన్ని ఖరారు చేయడానికి మధ్యవర్తులకు 60 రోజుల సమయం ఇస్తుంది. హర్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన నిర్దిష్ట నిబంధనలు కీలకం కానున్నాయి.
Iran US Peace Deal | తగ్గనున్న ఇంధన సంక్షోభం
యుద్ధాన్ని ముగించి జలసంధిని తిరిగి తెరిచేందుకు ఒప్పందం కుదిరితే, ప్రపంచ ఇంధన సంక్షోభం తగ్గనుంది. చర్చలు సానుకూలంగా ఉండటంతో ముడి చమురు ధరలు తగ్గాయి. ఆదివారం బ్రెంట్ క్రూడ్ (Crude Oil) ధరలు దాదాపు 1.5% తగ్గి బ్యారెల్‌కు సుమారు 99 డాలర్లకు చేరగా, యూఎస్ క్రూడ్ దాదాపు 5శాతం తగ్గి బ్యారెల్‌కు సుమారు 92 డాలర్లకు పడిపోయింది.
ఇది కూడా చదవండి..: Trump Modi friendship | మోడీ అంటే నాకు చాలా ఇష్టం.. ఐ లవ్ ఇండియా : డోనాల్డ్ ట్రంప్


