అంతర్జాతీయంIran US Peace Deal | ఇరాన్​తో అమెరికా శాంతి ఒప్పందం.. తెరుచుకోనున్న హర్ముజ్​

Iran US Peace Deal | ఇరాన్​తో అమెరికా శాంతి ఒప్పందం.. తెరుచుకోనున్న హర్ముజ్​

ఇరాన్‌, అమెరికా మధ్య దాదాపు శాంతి ఒప్పందం ఖరారు అయింది. దీంతో హర్ముజ్​ జలసంధి క్రమంగా తెరుచుకోనుంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran US Peace Deal | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇరాన్‌, అమెరికా మధ్య దాదాపు శాంతి ఒప్పందం ఖరారు అయింది. దీంతో హర్ముజ్​ జలసంధి (Strait of Hormuz) క్రమంగా తెరుచుకోనుంది. 60 రోజుల కాలవ్యవధిలో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

ఇరాన్​–అమెరికా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణంసైతం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హర్ముజ్​ జలసంధి నుంచి నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో గ్యాస్​, ముడి చమురు రవాణా నిలిచిపోయింది. ఈ క్రమంలో రెండు దేశాల చర్చల కోసం ప్రపంచం మొత్తం ఉత్కంఠగా చూస్తోంది. ఈ క్రమంలో శాంతి చర్చలు కొలిక్కిరావడం గమనార్హం.

Iran US Peace Deal | చర్చల దశలో..

యుద్ధ పరిష్కార ప్రయత్నాలలో అమెరికా, ఇరాన్‌ పురోగతిని సూచిస్తున్నప్పటికీ, ఒక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందానికి సంబంధించిన కీలక వివరాలు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. దీనిని ఖరారు చేయడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చని సమాచారం. ఒప్పందం దగ్గరలోనే ఉందని, అయితే కొనసాగుతున్న చర్చల సమయంలో ఇరాన్ ఓడరేవులపై అమెరికా నావికా దిగ్బంధనం కొనసాగుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెప్పారు. దీర్ఘకాలిక ఒప్పందాన్ని ఖరారు చేయడానికి మధ్యవర్తులకు 60 రోజుల సమయం ఇస్తుంది. హర్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన నిర్దిష్ట నిబంధనలు కీలకం కానున్నాయి.

Iran US Peace Deal | తగ్గనున్న ఇంధన సంక్షోభం

యుద్ధాన్ని ముగించి జలసంధిని తిరిగి తెరిచేందుకు ఒప్పందం కుదిరితే, ప్రపంచ ఇంధన సంక్షోభం తగ్గనుంది. చర్చలు సానుకూలంగా ఉండటంతో ముడి చమురు ధరలు తగ్గాయి. ఆదివారం బ్రెంట్ క్రూడ్ (Crude Oil) ధరలు దాదాపు 1.5% తగ్గి బ్యారెల్‌కు సుమారు 99 డాలర్లకు చేరగా, యూఎస్ క్రూడ్ దాదాపు 5శాతం తగ్గి బ్యారెల్‌కు సుమారు 92 డాలర్లకు పడిపోయింది.

ఇది కూడా చదవండి..: Trump Modi friendship | మోడీ అంటే నాకు చాలా ఇష్టం.. ఐ లవ్ ఇండియా : డోనాల్డ్​ ట్రంప్

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bandi Bhagirath Custody | బండి భగీరథ్​ పోలీస్​ కస్టడీకి కోర్టు అనుమతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Bhagirath Custody | బండి భగీరథ్​పై...

Vijay Krishna | బీజేవైఎం రాష్ట్ర కోశాధికారిగా అమంద్ విజయ్ కృష్ణ

అక్షరటుడే, ​నిజామాబాద్ సిటీ: Vijay Krishna| బీజేవైఎం (యువమోర్చా) (BJYM Telangana) రాష్ట్ర...

Population Change Committee | దేశంలో జనాభా మార్పులపై కేంద్రం కీలక నిర్ణయం

అక్షరటుడే‌ వెబ్‌‌డెస్క్: Population Change Committee | దేశంలో వేగంగా మారుతున్న...

Hyderabad Passport Services | బక్రీద్ సెలవుతో మే 28 నాటి పాస్‌పోర్ట్ స్లాట్స్.. మే 27కే రీషెడ్యూల్

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Passport Services | బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) పండుగ...