Realme 16T 5G | భారీ బ్యాటరీతో రియల్‌మీ ఫోన్

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Realme 16T 5G | చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో సబ్‌బ్రాండ్ అయిన రియల్‌మీ మిడ్‌రేంజ్ లో మరో మోడల్‌ను తీసుకువచ్చింది. రియల్‌మీ 16టీ పేరిట దేశీయ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది.

8000 ఎంఏహెచ్ బ్యాటరీ, పవర్‌ఫుల్ కెమెరా, ఏఐ పోర్ట్రెయిట్ గ్లో, ఏఐ ఇన్‌స్టంట్ క్లిప్ వంటి ఏఐ కెమెరా ఫీచర్లతో తీసుకువచ్చిన ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఈనెల 27 ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ (Flipkart), రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్లలో ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ విశేషాలు తెలుసుకుందామా..

డిస్‌ప్లే : 6.8 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే అమర్చారు. ఇది 144 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1200 నిట్స్ బ్రైట్‌నెస్ తో వచ్చింది.

ఫోన్ కింద పడ్డా పగలకుండా ఉండేందుకు మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, స్క్రీన్‌కు పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ 69 రేటింగ్ సర్టిఫికెట్ ఉంది.

సాఫ్ట్‌వేర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐ 7తో పనిచేస్తుంది.

Realme 16T 5G | కెమెరా సెటప్ ..

వెనకవైపు 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 852 ప్రధాన కెమెరాతో పాటు 2 ఎంపీ మోనోక్రోమ్ కెమెరాతో కూడిన డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. రీల్స్, షార్ట్ వీడియోలు చేసుకునే వారి కోసం ఏఐ పోర్ట్రెయిట్ గ్లో, ఏఐ ఇన్‌స్టంట్ క్లిప్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. వెనుక వైపు ఉన్న సెల్ఫీ మిర్రర్ సాయంతో మెయిన్ కెమెరాతోనే మంచి సెల్ఫీలు తీసుకోవచ్చు. ముందువైపు పంచ్‌హోల్ డిస్‌ప్లేతో 16 ఎంపీ సెన్సార్ ఇచ్చారు.

Realme 16T 5G | బ్యాటరీ సామర్థ్యం..

8000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 45 డబ్ల్యూ సూపర్‌వూక్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల 100 నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. బైపాస్ చార్జింగ్, వేరే ఫోన్లను చార్జ్ చేసుకోవడానికి 6.5 వైర్డ్ రివర్స్ చార్జింగ్ సదుపాయం కూడా ఉంది.

Realme 16T 5G | వేరియంట్స్

రియల్‌మీ 16టీ స్టార్‌లైట్ బ్లాక్, స్టార్‌లైట్ బ్లూ, స్టార్‌లైట్ రెడ్ కలర్ ఆప్షన్లలో మూడు వేరియంట్లలో లభిస్తుంది.
6జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.29,999.
8జీబీ, 128జీబీ వేరియంట్ రూ.31,999.
8జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.34,999.

కార్డ్ ఆఫర్స్ : ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై రూ. 2 వేల వరకు తక్షణ డిస్కౌంట్ లభించనుంది. ఈఎంఐపై రూ. 3 వేల వరకు తగ్గింపు వర్తించనుంది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

ఇది కూడా చదవండి..: PSU Q4 Results | క్యూ4లో అదరగొట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు.. లాభాల్లో ఎల్‌ఐసీ టాప్‌

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *