జాతీయం Rahul Gandhi on Fuel Price | ఇంధన ధరల పెరుగుదలపై రాహుల్​ గాంధీ విమర్శలు

 Rahul Gandhi on Fuel Price | ఇంధన ధరల పెరుగుదలపై రాహుల్​ గాంధీ విమర్శలు

దేశంలో ఇంధన ధరల పెరుగుదలపై లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీపై విమర్శలు చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Rahul Gandhi on Fuel Price | దేశంలో ఇంధన ధరల పెరుగుదలపై లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ (Rahul Gandhi) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీపై విమర్శలు చేశారు.

ద్రవ్యోల్బణ సూత్రధారి మోదీ మళ్లీ తన పని మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. పెట్రోల్-డీజిల్ ధరలను విడతల వారీగా పెంచుకుంటూ పోతున్నారని పేర్కొన్నారు. ప్రజల జేబును నిశ్శబ్దంగా దోచుకుంటూనే ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఆర్థిక సంక్షోభం గురించి తాను నెలల తరబడి హెచ్చరిస్తూనే ఉన్నానని తెలిపారు. కానీ మోదీజీ, ఎప్పటిలాగే, అప్పుడు ఎన్నికలతో తీరిక లేకుండా ఉన్నారని విమర్శించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే, పెట్రోల్-డీజిల్ ధరను రూ.8 వరకు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rahul Gandhi on Fuel Price | ఇంకా పెరుగుతాయి

పెట్రోల్​, డీజిల్ ధరలు ఇంకా పెరుగుతాయని రాహుల్ గాంధీ అన్నారు. ద్రవ్యోల్బణ సూత్రధారి మోదీ చేసే ఏకైక పని ఇదే అని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేయడం, మిగతా సమయమంతా ప్రజల జేబులపై దాడులు చేయడం అని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా పోస్టు చేశారు.

Rahul Gandhi on Fuel Price | సామాన్యులపై తీవ్ర భారం

కేంద్ర ప్రభుత్వం (Central Government) నాలుగో సారి పెట్రోల్​, డీజిల్​ ధరలను పెంచింది. 15 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు ఇంధన ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజా నిర్ణయం ప్రకారం.. పెట్రోల్‌పై లీటరుకు రూ. 2.84, డీజిల్‌పై లీటరుకు రూ. 2.86 మేర పెరిగాయి. సవరించిన ఈ ధరలు నేటి నుంచే (సోమవారం) దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. దీంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ధరల పెంపు భారం నుంచి కాపాలని పేద, మధ్య తరగతి ప్రజలు కోరుతున్నారు. అయితే నష్టాల సాకుతో కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థలు రేట్లను పెంచుతున్నాయి. రానున్న రోజుల్లో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి..: Modi Security Lapse | మోదీ పర్యటనలో భద్రతా లోపం.. జిలెటిన్ స్టిక్స్ కలకలం, ఆరుగురు పోలీసుల సస్పెన్షన్

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bandi Bhagirath Custody | బండి భగీరథ్​ పోలీస్​ కస్టడీకి కోర్టు అనుమతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Bhagirath Custody | బండి భగీరథ్​పై...

Vijay Krishna | తెలంగాణ బీజేవైఎం రాష్ట్ర కోశాధికారిగా అమంద్ విజయ్ కృష్ణ

అక్షరటుడే, ​నిజామాబాద్ సిటీ: Vijay Krishna| తెలంగాణ బీజేవైఎం (యువమోర్చా) (BJYM Telangana)...

Population Change Committee | దేశంలో జనాభా మార్పులపై కేంద్రం కీలక నిర్ణయం

అక్షరటుడే‌ వెబ్‌‌డెస్క్: Population Change Committee | దేశంలో వేగంగా మారుతున్న...

Hyderabad Passport Services | బక్రీద్ సెలవుతో మే 28 నాటి పాస్‌పోర్ట్ స్లాట్స్.. మే 27కే రీషెడ్యూల్

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Passport Services | బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) పండుగ...