అక్షరటుడే వెబ్‌డెస్క్:Excise Duty Cut|అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నా.. దేశంలోని సామాన్య ప్రజలపై ఆ భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద ఉపశమనాన్ని ప్రకటించింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.10 చొప్పున కేంద్ర అబ్కారీ పన్నును (సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ) తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సోమవారం ముంబైలో జరిగిన ‘సిడ్బీ’ (SIDBI) 37వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె ఈ కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) లో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశీయ వినియోగదారులను కాపాడడానికే ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.
Excise Duty Cut|కేంద్ర ఖజానాపై రూ.1 లక్ష కోట్ల భారం..
పన్ను తగ్గించడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడనుందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.1 లక్ష కోట్ల మేర రాబడి తగ్గుతుంది. ఈ భారీ ఆర్థిక భారాన్ని ప్రభుత్వం తనపైనే వేసుకుందని, ప్రజల సంక్షేమం , దేశ ఆర్థిక వృద్ధిని కాపాడటమే తమ తొలి ప్రాధాన్యతని ఆమె పేర్కొన్నారు.
Excise Duty Cut|3Fs ఫార్ములాతో ముందడుగు..
ప్రస్తుత ప్రపంచ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్రం మూడు ముఖ్యమైన అంశాలపై (3Fs – Fuel, Fertilizer, Foreign Exchange) ప్రత్యేక దృష్టి పెట్టిందని నిర్మలా సీతారామన్ వివరించారు. అంతర్జాతీయంగా ఇంధనం, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయని.. అలాగే బంగారం ధరల వల్ల విదేశీ మారకద్రవ్య నిల్వలపై కొంత ఒత్తిడి ఉందని ఆమె పేర్కొన్నారు.
Excise Duty Cut|మన ఆర్థిక వ్యవస్థ పటిష్టం..
ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సవాళ్లన్నీ అంతర్జాతీయ పరిస్థితుల వల్ల వచ్చినవే తప్ప, మన దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి డోకా లేదు. మన వ్యవస్థ అత్యంత పటిష్టంగా (Resilient) ఉంది అని ఆర్థిక మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కొందరు కావాలనే నిరాశావాదాన్ని ప్రచారం చేస్తున్నారని, కానీ భారత్ ఇలాంటి భయాలకు లొంగదని ఆమె స్పష్టం చేశారు. దేశంలో ఇంధన కొరత రాకుండా ఉండేందుకు వీలుగా పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి సుంకాలను కూడా సవరించామని, దీనివల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు మేలు జరుగుతుందని ఆర్థిక మంత్రి వివరించారు.
ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీ కోత.. కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన. లీటర్కు రూ.10 ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు. ఎక్సైజ్ డ్యూటీ కోతతో కేంద్రానికి రూ.1లక్ష కోట్ల ఆదాయ నష్టం. ధరల పెరుగుదల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకే ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు. -నిర్మలాసీతారామన్#BreakingNews…
— NTV Breaking News (@NTVJustIn) May 25, 2026
ఇది కూడా చదవండి: Tractor Accident | మొక్కులు తీర్చుకుని వస్తుండగా విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి ఇంటర్ విద్యార్థిని దుర్మరణం


