Bharat Pak Border Video | ఆకాశం నుంచి మెరిసిన భారత్-పాక్ సరిహద్దు.. నెట్టింట వైరల్ అవుతున్న ఇండిగో పైలట్ వీడియో!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bharat Pak Border Video | భారత్-పాకిస్థాన్ సరిహద్దు అనగానే సాధారణంగా ఇరు దేశాల సైనికులు, కంకర తీగలు, భారీ భద్రత మాత్రమే గుర్తొస్తాయి. కానీ, అదే సరిహద్దును రాత్రి వేళ అంతరిక్షం నుంచో లేదా విమానంలోంచో చూస్తే ఎలా ఉంటుంది?

ఊహించుకోవడానికే అద్భుతంగా ఉంది కదూ! సరిగ్గా ఇలాంటి ఒక అరుదైన, కంటికి విందు చేసే దృశ్యాన్ని కెమెరాలో బంధించారు ఒక ఇండిగో పైలట్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

Bharat Pak Border Video | చీకటిలో ‘రాడ్‌క్లిఫ్ లైన్’

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన పైలట్ ప్రదీప్ కృష్ణన్ కాక్‌పిట్ నుంచి ఈ అద్భుతమైన దృశ్యాన్ని చిత్రీకరించారు. రాత్రి వేళ విమానం ప్రయాణిస్తున్న సమయంలో.. కింద భూమిపై భారత్-పాక్ సరిహద్దు రేఖ ఒక వెలుగుల గీతలా స్పష్టంగా కనిపించింది.

సరిహద్దు వెంబడి ఇరు దేశాలు ఏర్పాటు చేసిన శక్తివంతమైన ఫ్లడ్‌లైట్ల వెలుతురు కారణంగా.. చీకటిలో ఈ బోర్డర్ ఒక బంగారు రంగు తీగలా మెరిసిపోతూ కనిపించింది.

“రాత్రి వేళ ఆకాశం నుంచి భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు (రాడ్‌క్లిఫ్ లైన్) ఇలా కనిపిస్తుంది” అంటూ పైలట్ ప్రదీప్ కృష్ణన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Bharat Pak Border Video | నెటిజన్లు ఫిదా..

సాధారణంగా ఇలాంటి దృశ్యాలను నాసా (NASA) శాస్త్రవేత్తలు అంతరిక్షం నుంచి తీసిన శాటిలైట్ చిత్రాల్లో మాత్రమే చూస్తుంటాం. కానీ ఒక వాణిజ్య విమానం (Commercial Flight) నుంచి ఇంత స్పష్టంగా, అందంగా బోర్డర్ లైన్ కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షలాది వ్యూస్, వేలాది లైకులతో ఇది నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉండే సరిహద్దు ప్రాంతం, రాత్రి వేళ ఇంత శాంతంగా, ప్రకాశవంతంగా కనిపించడం ఒక అరుదైన అనుభూతి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మ్యాప్‌లలో గీతల రూపంలో చూసే సరిహద్దును.. ఇలా నిజంగా వెలుగుల గీతలా చూడటం నిజంగానే ఒక అద్భుత దృశ్యం!

11,000-Carat Rare Ruby Discovered in Mogok | “రక్తపు వెలుగులీనిన వెదజల్లిన రత్నాల గడ్డ” 

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments
  • Naresh chandan garu meeru yekkada vuntaru, public ki upayoga pade varthalu rayandi sir, petrol bunk lo facilities yemi vundavu, vaati gurinchi wrayandi sir,

    • తప్పకుండా రాస్తాను.. అందరూ ఒకేలా ఉండరు కదా రాము గారు.. అందుకే అన్ని రకాల వార్తలను ఇస్తుంటాం. మీరు కోరిన వార్త తప్ప కుండా రాస్తాను… థాంక్యూ రాము గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *