Trump Golf Course Project | ట్రంప్‌నకు కోర్టులో ఎదురుదెబ్బ.. చారిత్రాత్మక గోల్ఫ్ కోర్స్ ఆధునికీకరణకు తాత్కాలిక బ్రేక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఓ ప్రాజెక్టుకు న్యాయస్థానంలో చుక్కెదురైంది.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Trump Golf Course Project | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఓ ప్రాజెక్టుకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌కు సమీపంలో ఉన్న చారిత్రాత్మక ‘ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ లింక్స్’ (East Potomac Golf Links) పబ్లిక్ గోల్ఫ్ కోర్స్‌ను ఆధునికీకరించే పనులకు అమెరికా కోర్టు తాత్కాలికంగా స్టే విధించింది.

ఈ ప్రాజెక్టు కోసం గోల్ఫ్ కోర్స్‌ను 15 నెలల పాటు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, నిర్మాణ పనులు మొదలవడానికి కొద్ది గంటల ముందే న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆధునికీకరణ పేరుతో దీని అసలు స్వరూపం దెబ్బతీయడంతో పాటు, ఫీజులు పెంచి సామాన్యులకు గోల్ఫ్ దూరం చేస్తారంటూ.. స్థానికులు, డీసీ ప్రిజర్వేషన్ లీగ్ ఫిబ్రవరిలోనే న్యాయపోరాటం ప్రారంభించాయి.

Trump Golf Course Project | అన్నా రేయెస్ అసంతృప్తి..

శుక్రవారం సుమారు ఐదు గంటల పాటు జరిగిన విచారణలో, భద్రతా కారణాల రీత్యా పార్కును మూసివేస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు. అలాగే ప్రస్తుత నిర్వహణ సంస్థ ‘నేషనల్ లింక్స్ ట్రస్ట్’ ఒప్పందం ఆదివారంతో ముగుస్తోందని తెలిపారు.

అయితే ఈ వాదనలపై న్యాయమూర్తి అన్నా రేయెస్ (Anna Reyes) సందేహాలు వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా లేని భద్రతా కారణాలు ఇప్పుడే ఎందుకు తెరపైకి వచ్చాయని ఆమె ప్రశ్నించారు. మరోవైపు స్థానికులకు ఫీజులో 50 శాతం రాయితీ ఇస్తామని ట్రంప్ ప్రకటించినా.. న్యాయమూర్తి తమ ప్రయత్నాలకు సహకరించడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Trump Golf Course Project | తప్పుడు సమాచారంపైనా విచారణ..

వాషింగ్టన్‌లో ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన స్మారక ద్వారం, వైట్‌హౌస్ బాల్‌రూమ్ వంటి ఇతర ప్రాజెక్టులకు కూడా ఇటీవల న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. అక్టోబర్‌లో ఈ గోల్ఫ్ పార్కులోని చెట్లను నరికివేసిన ఘటనపైనా న్యాయమూర్తి ప్రశ్నలు లేవనెత్తారు.

అంతేకాకుండా ఈ వ్యవహారంలో ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారా.. అనే కోణంలోనూ విచారణ మొదలైంది. ఈ క్రమంలో జడ్జి అన్నా రేయెస్‌ను విచారణ నుంచి తప్పించాలని అమెరికా న్యాయ శాఖ కోరినప్పటికీ, తాను తప్పుకొనే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: US Flight Resumption | అమెరికాలో విమాన ప్రయాణాలు పునరుద్ధరణ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *