Birsa Munda Jayanti | బిర్సా ముండా పోరాటం చిరస్మరణీయం

బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి, గిరిజనుల భూ హక్కుల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన బిర్సా ముండా జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ​నిజామాబాద్ సిటీ : Birsa Munda Jayanti | బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి, గిరిజనుల భూ హక్కుల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన భగవాన్ బిర్సా ముండా జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్లో ‘జనజాతీయ గౌరవ దివస్’ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Birsa Munda Jayanti | గిరిజనుల హక్కుల కోసం..

​ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్, బిర్సా ముండా (Birsa Munda) చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ..గిరిజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. బిర్సా ముండా పోరాట ఫలితంగానే 1908లో గిరిజనుల హక్కుల రక్షణకు దోహదపడేలా ‘టెనెన్సీ యాక్ట్’ రూపొందిందని గుర్తుచేశారు. భారత స్వాతంత్ర్యానంతరం గిరిజనుల హక్కులకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించడంతో పాటు పార్లమెంట్, శాసనసభలు, పంచాయతీలు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. గిరిజనుల గొప్ప చరిత్ర, వారసత్వ సంపద, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలనే సంకల్పంతో ప్రభుత్వం బిర్సా ముండా జయంతిని ‘జనజాతీయ గౌరవ దివస్’గా నిర్వహిస్తోందని పేర్కొన్నారు.
​ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి భాస్కర్, ఏవో వేణుమాధవ్, సహదేవ్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Gaddam Indupriya | తెలంగాణ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా గడ్డం ఇందుప్రియ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *