నిజామాబాద్Nizamabad Premier League | యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి : జిల్లా జడ్జి భరతలక్ష్మి

Nizamabad Premier League | యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి : జిల్లా జడ్జి భరతలక్ష్మి

యువత చదువుతోపాటు క్రీడల్లో పాలు పంచుకోవాలని జిల్లా జడ్జి భరత లక్ష్మి పేర్కొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నగరంలోని ఉమెన్స్​ కళాశాల గ్రౌండ్​లో నిజామాబాద్​ ప్రీమియర్​ లీగ్​లో భాగంగా క్రికెట్​ టోర్నమెంట్​ నిర్వహించారు.

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Premier League | యువత చదువుతోపాటు క్రీడల్లోనూ పాలు పంచుకోవాలని జిల్లా జడ్జి భరత లక్ష్మి (Judge Bharatha Lakshmi) పేర్కొన్నారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్​ ప్రీమియర్​ లీగ్​లో భాగంగా నగరంలోని ఉమెన్స్​ కళాశాల (Women’s College) మైదానంలో క్రికెట్​ టోర్నీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య​అతిథిగా హాజరైన జిల్లా జడ్జి టోర్నీని ప్రారంభించి మాట్లాడారు.

Nizamabad Premier League | విద్యార్థుల్లో పోటీతత్వం..

ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో చదువుల్లో పోటీతత్వం పెరగడం మంచిదేనని.. కానీ, ఒత్తిడిని ఎదుర్కొనే మానసిక స్థైర్యం కూడా పెంపొందించుకోవాలన్నారు. మానసికంగా, శారీరకంగా చైతన్యవంతం చేయడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఆమె అన్నారు.

ఉద్యోగుల్లో ముఖ్యంగా పోలీస్, న్యాయశాఖ తదితర శాఖల్లో ఉద్యోగస్థులు తమ విధి నిర్వహణలో ఎంతో ఒత్తిడికి లోనవుతారని ఇలాంటి తరుణంలో వారిని శారీరకంగా, మానసికంగా ఉత్సాహం కలిగించడానికి ఇలాంటి క్రీడలు ఉపయోగపడతాయన్నారు.

నేషనల్​ కౌన్సిల్​ ఛైర్మన్​, సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థులకే కాకుండా ఉద్యోగస్థులకు కూడా ఎంతో అవసరమన్నారు. నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) ​ పరిధిలో ఉద్యోగ బాధ్యతలు ఎంతో శారీరక, మానసిక శక్తిని హరిస్తాయన్నారు. దీంతో శారీరక, మానసిక ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు.

Nizamabad Premier League | 28వ తేదీ వరకు పోటీలు..

ఈ టోర్నీ సోమవారం ప్రారంభం అయింది. 28వ తేదీ వరకు కొనసాగనుంది. క్రికెట్​తో పాటు ఇతర క్రీడల్లోనూ పోటీలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్), ఎన్ఎస్ఈ కన్వీనర్ బస్వా రెడ్డి, అదనపు డీసీపీ (ఏఆర్) రామచంద్రరావు, ఎన్ఎస్ఈ జనరల్ సెక్రెటరీ డాక్టర్ కవితా రెడ్డి, ట్రెజరర్ సంతోష్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ కాకతీయ విద్యాసంస్థల అధినేత రజనీకాంత్, శివప్రసాద్, దుశ్శాంత్, ఎన్ఎస్ఈ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పాల్గొన్నారు.

వీరితోపాటు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సీటీసీ ట్రాఫిక్ ఏసీపీలు ప్రకాష్, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, రాజశేఖర్, మస్తాన్ అలీ, ఫోర్త్ అడిషనల్ జడ్జ్​ దుర్గాప్రసాద్, సెకండ్ అడిషనల్ జడ్జి​ నారాయణ, పీడీఎం గోపీకృష్ణ, జిల్లాలోని సీఐలు ఎస్సైలు, అడ్వకేట్లు తదితరులున్నారు.

33

22

ఇది కూడా చదవండి :Harish Rao Delhi Visit | హరీశ్​రావు అందుకే ఢిల్లీ వెళ్లారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

DJ Sound | డీజే శబ్దం భరించలేక 140 కోళ్లు మృతి.. ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన

అక్షరటుడే, వెబ్​డెస్క్: DJ Sound | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని...

Bellamkonda Wedding | రుమలలో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం.. కావ్య రెడ్డితో కొత్త జీవితానికి శ్రీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bellamkonda Wedding | తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక...

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...