UncategorizedTesla Telangana EV | తెలంగాణలో టెస్లా విస్తరణ.. మంత్రి పొన్నంతో ఈవీ దిగ్గజం కీలక...

Tesla Telangana EV | తెలంగాణలో టెస్లా విస్తరణ.. మంత్రి పొన్నంతో ఈవీ దిగ్గజం కీలక చర్చలు

అక్షరటుడే వెబ్‌డెస్క్:Tesla Telangana EV | తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రముఖ గ్లోబల్ ఈవీ దిగ్గజం ‘టెస్లా’ (Tesla) సంస్థ తెలంగాణలో తన వ్యాపార విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా టెస్లా ఇండియా ప్రతినిధులు తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా పంచుకున్నారు.

Tesla Telangana EV  |నేరుగా వినియోగదారులకే సేవలు..

టెస్లా ఇండియా జనరల్ మేనేజర్ శరద్ అగర్వాల్, పబ్లిక్ పాలసీ & బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ రజత్ ఈ సమావేశంలో పాల్గొని, టెస్లా కంపెనీ అనుసరిస్తున్న ‘డైరెక్ట్-టు-కన్స్యూమర్’ (వినియోగదారులకు నేరుగా విక్రయించే) వ్యాపార విధానాన్ని మంత్రికి వివరించారు. కంపెనీ ద్వారానే నేరుగా నిర్వహించే ఈ వ్యవస్థ వల్ల వాహనాల విక్రయాలు, ధరలు, డెలివరీ, , కస్టమర్ సర్వీసుల్లో ఎలాంటి మధ్యవర్తులు లేకుండా పూర్తి పారదర్శకత ఉంటుందని వారు పేర్కొన్నారు.

Tesla Telangana EV | రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనపై చర్చలు..

తెలంగాణలో టెస్లా ఆధ్వర్యంలోనే నడిచే సేల్స్, డెలివరీ, సర్వీస్ సెంటర్లతో పాటు ఈవీ వాహనాల కోసం ప్రత్యేక ‘టెస్లా సూపర్‌చార్జర్’ (Supercharger) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నెట్‌వర్క్‌ను తీసుకురావడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చలు జరిగాయి. తెలంగాణలో స్థిరమైన రవాణా వ్యవస్థను (Sustainable Mobility) నిర్మించాలనే ప్రభుత్వ సంకల్పానికి, ఇక్కడి ఈవీ ఎకోసిస్టమ్‌కు టెస్లా విస్తరణ ప్రణాళికలు మరింత బలాన్ని చేకూరుస్తాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

ponnam 2

ఇది కూడా చదవండి: Grain procurement issues | అన్నదాత ఆక్రోషం.. రోడ్డుపై ధాన్యం బస్తాలు తగలబెట్టి నిరసన

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Passport Services | బక్రీద్ సెలవుతో మే 28 నాటి పాస్‌పోర్ట్ స్లాట్స్.. మే 27కే రీషెడ్యూల్

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Passport Services | బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) పండుగ...

New Pensions | జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు.. అర్హతలు, కావాల్సిన సర్టిఫికెట్లు ఇవే..

అక్షరటుడే, వెబ్​డెస్క్: New Pensions | రాష్ట్ర ప్రభుత్వం (State Government)...

Bhupathi Reddy Warning | చెరువులను కబ్జా చేస్తే చర్యలు తప్పవు: రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

అక్షరటుడే, డిచ్​పల్లి: Bhupathi Reddy Warning | నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో...

Skoda Epiq EV | సింగిల్ ఛార్జ్​తో 440 కిలోమీటర్లు.. త్వరలో మార్కెట్ లోకి స్కోడా కొత్త ఈవీ కారు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Skoda Epiq EV | ప్రముఖ కార్ల తయారీ...