తెలంగాణHeavy Rain Havoc | గాలివాన బీభత్సం.. రైతుల ఇక్కట్లు

Heavy Rain Havoc | గాలివాన బీభత్సం.. రైతుల ఇక్కట్లు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rain Havoc | తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు వదలడం లేదు. రోజంతా ఎండలు దంచి కొడుతున్నా.. సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. దీంతో పంట ఉత్పత్తులు తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

తెలంగాణ (Telangana), ఏపీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, తిరుపతి, అనకాపల్లి జిల్లాల్లో వాన పడింది. తెలంగాణలోని జగిత్యాల, హన్మకొండ, భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వాన బీభత్సం సృష్టించింది. ఈదరుగాలుల దాటికి అనేక చెట్లు నేలకొరిగాయి. విద్యుత్​ స్తంభాలు విరిగిపడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, మక్కలు తడిసిపోయాయి.

Heavy Rain Havoc | హన్మకొండలో..

హనుమకొండ (Hanmakonda) జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దుమ్ము, ధూళితో కూడిన ఈదురుగాలులు ఉధృతంగా వీస్తుండటంతో వాతావరణం భయానకంగా మారింది. గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో, ధాన్యంపై కప్పిన పరదాలు సైతం కొట్టుకుపోతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

Heavy Rain Havoc | విశాఖ బీచ్ రోడ్డులో అరుదైన దృశ్యం

Heavy Rain Havoc

విశాఖపట్నం (Visakhapatnam) బీచ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆకాశమంతా దట్టమైన నల్లటి మబ్బులు కమ్ముకోవడంతో పగలే చీకటిగా మారిన వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో సముద్రం, ఆకాశం రెండు ఒకదానికొకటి కలిసిపోయాయా అన్నట్లుగా కనిపించిన అత్యంత అరుదైన దృశ్యం స్థానికులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది.

దీనిని కూడా చదవండి : Mudiraj BC-A Demand | ముదిరాజ్‌లను బీసీ-ఏ జాబితాలోకి చేర్చాలి: ఈటల రాజేందర్

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Twisha Sharma Case | ట్విషా శర్మ మృతి కేసు.. సీబీఐ దర్యాప్తు ముమ్మరం.. కేసు డైరీని అప్పగించిన ఎస్‌ఐటీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Twisha Sharma Case | దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

Telangana Heavy Rains | తెలంగాణపై ‘వరుణుడి’ తాండవం.. పలు జిల్లాలకు తుపాను హెచ్చరిక.. నేడు రాత్రి కంటిమీద కునుకు కరవే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Heavy Rains | తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా...

Panchayat Staff Salaries | పంచాయతీ సిబ్బందికి తీపి కబురు.. ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని సీఎం ఆదేశం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Panchayat Staff Salaries | రాష్ట్రంలోని 50 వేల...

KVIC Khadi Growth | ఖద్దరుకు ‘మహా’ వైభవం.. ₹1.87 లక్షల కోట్లకు చేరిన ఖాదీ టర్నోవర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: KVIC Khadi Growth | భారతీయ సంస్కృతికి, స్వదేశీ...