అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Heavy Rains | తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
రాత్రి వేళల్లో వాతావరణ శాఖ జారీ చేసిన తాజా హెచ్చరికల ప్రకారం.. రాగల కొన్ని గంటల పాటు రాష్ట్రంలో ‘తుపాను రాత్రి’ (Stormy Night) గా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.
Telangana Heavy Rains | జిల్లాల వారీగా తాజా వాతావరణ పరిస్థితి..
ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాను శక్తివంతమైన తుపాను మేఘాలు కమ్మేసి, తీవ్రమైన వర్షాలు పడుతున్నాయి. ఈ తుపాను తీవ్రత రాబోయే రెండు గంటల్లో పొరుగు జిల్లాలకు విస్తరించనుంది.
నిర్మల్ జిల్లాలోని మామ్డ, ఖానాపూర్, దస్తూరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
జగిత్యాల, నిజామాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ రాబోయే రెండు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
Telangana Heavy Rains | మరో మూడు జిల్లాలకు వాన గండం
రాబోయే ఒక గంటలో కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల్లో చెల్లాచెదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక పరిసర ప్రాంతాల్లో తుపాను ప్రభావం కనిపించనుంది.
Telangana Heavy Rains | దక్షిణ, తూర్పు తెలంగాణలోనూ ఉద్ధృతి
తెలంగాణలోని దక్షిణ, తూర్పు జిల్లాల్లో రాబోయే 1 – 2 గంటల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన తుపాను (Intense Thunderstorms) వీచే ప్రమాదం ఉందని వాతావరణ నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
నల్గొండ జిల్లాలోని మర్రిగూడ, చండూరు, నాంపల్లి, దేవరకొండ ప్రాంతాల్లో తీవ్ర వాతావరణ మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లోని పలు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
Telangana Heavy Rains | జాగ్రత్తలు అవసరం
రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని తుపాను మేఘాలు వేగంగా విస్తరిస్తుండటంతో ఈ రాత్రి అంతా వాతావరణం అత్యంత అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది.
కాబట్టి ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, విద్యుత్తు స్తంభాలు, పాత గోడలు, చెట్ల కింద నిలబడవద్దని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు.
Jukkal MLA Comments | పోలీస్ vs ప్రజాప్రతినిధులు! అధికార పక్షంలో…


