Nizamabad Police | నగరంలో దొంగ హల్​చల్​.. పలు ఇళ్లల్లో దోపిడీ..

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad Police | నగరంలో ఓ దొంగ హల్​చల్​ చేశాడు. అర్ధరాత్రివేళ ఏకంగా ఇళ్లలోకి దూరి ప్రజలను భయపెట్టి దోపిడీకి పాల్పడ్డాడు. ఇళ్లలోకి వెళ్లి దోచుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. నగరం(Nizamabad City) నడిబొడ్డున ఈ ఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Nizamabad Police | పద్మానగర్​లో..

నాలుగో టౌన్ పోలీసులు (Nizamabad Police Commissionerate) తెలిపిన వివరాల ప్రకారం.. పద్మానగర్( Padmanagar) రోడ్ నం.2,3లలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ దొంగ ప్రవేశించాడు. మొదట ఓ ఇంట్లోకి ప్రవేశించిని దొంగ ఇంట్లో ఉన్న వ్యక్తిని బెదిరించి మూడు గ్రాముల గొలుసు, రూ.10వేల నగదును దోపిడీ చేశాడు. అనంతరం పక్క వీధిలో ఉన్న మరో ఇంట్లోకి ప్రవేశించి వారిని సైతం బెదిరించి రెండున్నర తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు.

అనంతరం పక్కనే మరో ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్ధులను భయపెట్టి వారి వద్ద నుంచి రూ.3,500 నగదును దోచుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థానానికి చేరుకుని క్లూస్ టీంతో(Clues Team) ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నామని త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

photoxtory

ఇది కూడా చదవండి: Nara Lokesh Mahanadu | లోకేశ్ సస్పెన్స్ ట్వీట్.. ఆ ‘కీలక ప్రకటన’ ఏంటి?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *