అంతర్జాతీయంTim Cook Resignation | యాపిల్​ సీఈవో టిమ్ కుక్ తన బాధ్యతలకు గుడ్​బై.. కొత్త...

Tim Cook Resignation | యాపిల్​ సీఈవో టిమ్ కుక్ తన బాధ్యతలకు గుడ్​బై.. కొత్త సారథిగా జాన్​ టెర్నస్​!

యాపిల్‌ సంస్థలో ప్రస్తుతం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఇంజనీరింగ్)గా పనిచేస్తున్న జాన్ టెర్నస్ నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tim Cook Resignation | టెక్ దిగ్గజం యాపిల్‌లో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఆ సంస్థ సీఈఓగా దీర్ఘకాలంగా సేవలందిస్తూ వచ్చిన టిమ్ కుక్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 1వ తేదీన ఆయన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.

Tim Cook Resignation | సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​..

టిమ్ కుక్ Tim Cook స్థానంలో మరొకరు రాబోతున్నారు. యాపిల్‌ సంస్థలో ప్రస్తుతం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఇంజనీరింగ్)గా పనిచేస్తున్న జాన్ టెర్నస్ నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మార్పుతో యాపిల్ సంస్థలో కొత్త నాయకత్వం రాబోతోంది.akshara today .jpgtim

Tim Cook Resignation | ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్

స్టీవ్ జాబ్స్ అనంతరం టిమ్ కుక్ సారథ్య బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘ కాలంగా ఆ సీఈవోగా యాపిల్‌ను ముందుకు నడిపించి, సంస్థను ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు.

ఆయన హయాంలో యాపిల్ వ్యాపార విస్తరణ, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, సేవల విభాగం అభివృద్ధి గణనీయంగా పెరిగాయనేది నిర్వివాదాంశం. ఇక సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుంటున్న టిమ్ కుక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవిలోకి మారనున్నారు

సీఈవో మార్పు పరిణామం టెక్ ప్రపంచంలో ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్న జాన్ టెర్నస్ నాయకత్వంలో యాపిల్ భవితవ్యం ఎలా ఉండబోతుందన్నదానిపై ఆసక్తి నెలకొంది.

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....