VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మంత్రుల వ్యవహార శైలిపై ఆ పార్టీ సీనియర్ నేత వీ. హనుమంతరావు (వీహెచ్‌) తీవ్రంగా మండిపడ్డారు.

మంత్రులు తమ పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన బహిరంగంగానే హెచ్చరించారు. నియోజకవర్గాల పర్యటనల్లో స్థానిక ఇంఛార్జ్‌లను, సీనియర్ నాయకులను మంత్రులు కనీసం పట్టించుకోవడం లేదని వీహెచ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

akshara today 1 1.jpgVH 1

VH Criticizes Congress Ministers | ఆస్తులు అమ్ముకున్నోడిని వదిలేస్తే ఎట్లా?

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడి, నియోజకవర్గాల్లో పార్టీని బతికించడం కోసం కొందరు నాయకులు తమ సొంత ఆస్తులను సైతం అమ్ముకున్నారని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అలాంటి వారు ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన, ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రులు వారిని విస్మరించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.

“పార్టీ కోసం సర్వస్వం త్యాగం చేసి బాధ్యతలు నెరవేర్చుతున్న ఇంఛార్జ్‌లను అధికారిక పర్యటనలకు పిలవకపోవడం ఘోరమైన విషయం. ఇది ఆయా నాయకులను నిలువునా అవమానించడమే. ఓడిపోయిన నాయకులను మంత్రులు ఇలా అర్ధాంతరంగా వదిలేస్తే క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ కు ఏం సందేశం వెళ్తుంది?” అని వీహెచ్ నిలదీశారు.

vh

VH Criticizes Congress Ministers | పార్టీకి నష్టం.. హెచ్చరించిన సీనియర్ నేత

అధికార మదంతో కొందరు మంత్రులు వ్యవహరిస్తున్న తీరు వల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని వీహెచ్ విమర్శనాత్మక హెచ్చరికలు జారీ చేశారు.

నాయకుల మధ్య సమన్వయం లేకపోతే భవిష్యత్తులో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రులు తక్షణమే తమ ప్రొటోకాల్ ధోరణిని పక్కన పెట్టి, నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు, స్థానిక నాయకత్వానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని హితబోధ చేశారు.

ప్రస్తుతం వీహెచ్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ మంత్రులపైనే ఒక సీనియర్ నాయకుడు ఈ స్థాయిలో విమర్శలు గుప్పించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Japan Mango Export Ban | పాలకుల నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపం…..

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *