హైదరాబాద్Emergency Landing | శంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్

Emergency Landing | శంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్

బెంగళూరు-నాగ్‌పూర్ ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Emergency Landing | శంషాబాద్‌ (Shamshabad)లో శనివారం ఉదయం ఓ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. బెంగళూరు-నాగ్‌పూర్ ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.

సమస్యను గుర్తించిన పైలట్​ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారి సూచన మేరకు శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport)లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో ఫ్లైట్​లో 126 మంది ప్యాసింజర్స్​ ఉన్నారు.

Emergency Landing | రెండు విమానాలకు తప్పిన ప్రమాదం

Emergency Landing

శంషాబాద్‌ ఎయిర్​పోర్టులో శుక్రవారం రెండు విమానాలకు ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం శంషాబాద్‌ నుంచి జగదలపూర్‌కు బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్‌ అయిన వెంటనే సాంకేతిక లోపానికి గురైంది. అప్రమత్తమైన పైలట్‌.. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) అనుమతితో సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్​ చేశాడు. మరో ఘటనలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం మధ్యాహ్నం రాజమండ్రికి బయలుదేరిన విమానంలోనూ టేకాఫ్‌ అయిన తర్వాత ఇంజన్‌ సమస్యను గుర్తించారు. అనంతరం ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేశారు. శంషాబాద్​లో తరచూ విమానాల్లో సాంకేతిక లోపాలు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇది కూడా చదవండి..: Muski Lake Protection | ముష్కి చెరువు పరిరక్షణకు చర్యలు.. కంచె వేస్తున్న హైడ్రా

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

LPG PNG Rules | గ్యాస్ వినియోగదారులకు షాక్.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్

అక్షరటుడే వెబ్‌డెస్క్: LPG PNG Rules | దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగంలో...

Balka Suman Arrest | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​ అరెస్ట్ 

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balka Suman Arrest | బీఆర్​ఎస్​ నాయకుడు,...

Phone Explosion | జేబులో సెల్​ఫోన్ ఉందా.. తస్మాత్​ జాగ్రత్త..?

అక్షరటుడే, కామారెడ్డి: Phone Explosion | చాలామందికి షర్ట్​ జేబులో సెల్​ఫోన్​...